పంచాయతీలో అక్కడ టీడీపీ గుండు సున్నా.. బీజేపీ లీడ్

ఆఖరి విడత పంచాయతీ ఎన్నికల్లో తెలుగు దేశం పార్టీకి ఏపీ సీఎం జగన్ సొంత జిల్లాలో గట్టి షాక్ తగిలింది. వైఎస్ఆర్ కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జీరోగా నిలవడం ఆసక్తిదాయకంగా మారింది. రాష్ట్రంలోని పలు నియోజకవర్గాల్లో టీడీపీ జీరోగా నిలవడం సంచలనమైంది.

సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందులతోపాటు మాచర్ల పుంగనూరు నెల్లూరు రూరల్ అనంతపురం నియోజకవర్గాల్లో టీడీపీ పూర్తిగా జీరోగా మారింది. ఒక్కటంటే ఒక్క పంచాయతీలో నెగ్గిన అభ్యర్థి కూడా తను తెలుగు దేశం అని చెప్పుకోకపోవడం విశేషం.

జమ్మలమడుగులో అయితే టీడీపీ పరిస్థితి ఘోరంగా మారింది. అన్ని పంచాయతీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పడకపోవడం గమనార్హం. ఇక్కడ 11 పంచాయతీల్లో బీజేపీ నెగ్గడం విశేషంగా మారింది.

జగన్ ఫ్యామిలీకి పులివెందులతోపాటు జమ్మలమడుగులో పట్టు ఉంది. అనంతపురంతో సరిహద్దును పంచుకునే ఈ నియోజకవర్గంలో వైఎస్ ఫ్యామిలీకి బలం ఉంది. ఇక్కడ బీజేపీ గెలిచిందంటే దానికి కారణంగా టీడీపీ నుంచి బీజేపీలో చేరిన మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డినే.. ఆదినారాయణ రెడ్డి వర్గీయులే ఈ పంచాయతీల్లో గెలిచి టీడీపీకి షాక్ ఇచ్చారు. ఇక్కడ టీడీపీకి ఆదినారాయణ రెడ్డి రామసుబ్బారెడ్డి దూరం కావడంతో జీరోగా మారిపోయింది.
× RELATED ఆ ఐటీ కంపెనీలో కొలువుల వరద .. త్వరలో 30 వేల జాబ్స్ భర్తీ !
×