ఒకేసారి రెండు OTTల్లో రామ్ RED స్ట్రీమింగ్

ఇస్మార్ట్ శంకర్ చిత్రంతో బ్లాక్ బస్టర్ అందుకున్న రామ్ రెట్టించిన ఉత్సాహంతో రెడ్ చిత్రంలో నటించాడు. కానీ ఈ సినిమా ఆశించినంత విజయం సాధించలేదు. సంక్రాంతి బరిలో రిలీజ్ కావడం కొంతవరకూ బాక్సాఫీస్ కలెక్షన్ల పరంగా కలిసొచ్చింది. అయితే ఈ సినిమాని తొలుత థియేటర్లలో రిలీజ్ చేసిన నిర్మాతలు.. ఆ వెంటనే ఓటీటీలోనూ రిలీజ్ చేయడం ఆసక్తిని రేకెత్తిస్తోంది.

రెడ్ చిత్రం సోమవారం అర్ధరాత్రి నుండి నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగుకి వచ్చింది. కేవలం 40 రోజుల్లో ఓటీటీలో అందుబాటులోకి వచ్చేయడం విశేషం. ఇటీవల థియేట్రికల్ రన్ ముగిసింది. ఈలోగానే ఓటీటీలో అందుబాటులోకి వచ్చింది. నెట్ ఫ్లిక్స్ తో పాటు మంగళవారం నుంచి సన్ నెక్ట్స్ టీలో రెడ్ ప్రసారం కానుంది. ఒకేసారి రెండు OTT వేదికలపై ఇది అందుబాటులోకి వస్తుండడంతో వైరల్ గా ఆదరణ పొందుతుందని భావిస్తున్నారు.

తమిళ బ్లాక్ బస్టర్ తడం ఆధారంగా రూపొందిన క్రైమ్ థ్రిల్లర్ రెడ్. రామ్ ఇందులో ద్విపాత్రలు పోషించారు. అతడి నటనకు ప్రశంసలు కురిసినా సమీక్షలు నెగెటివ్ అయ్యాయి. ఇక రామ్ తదుపరి రెండు సినిమాలకు సంతకాలు చేసిన సంగతి తెలిసిందే.  తమిళ దర్శకుడు లింగుసామి నిర్ధేశనంలో ద్విభాషా చిత్రంలో నటించనున్నాడు.
× RELATED ఎర్ర మిర్చి రెడ్ ఫ్లేమ్ అంటూ యాంకర్ వెంట పడ్డారు!
×