టెన్త్ ఫెయిల్ అయిన రౌడీ.. ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నాడు!

బిగ్ బీ అమితాబ్ వారసుడిగా తెరంగేట్రం చేసిన అభిషేక్.. బాలీవుడ్లో నిలదొక్కుకోవడానికి మొదట్లో చాలా కష్టపడ్డాడు. ఆ తర్వాత తనదైన యాక్టింగ్ తో స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. గతేడాది ఓటీటీ ద్వారా ప్రేక్షకులను అలరించిన అభిషేక్.. ఇప్పుడు బిగ్ స్క్రీన్ పై సందడి చేయబోతున్నాడు.

ప్రస్తుతం అభిషేక్ బచ్చన్ హీరోగా ఓ మూవీ తెరకెక్కుతోంది. ‘దస్వీ’ పేరుతో రూపొందుతున్న ఈ సినిమాను.. తుషార్ జొలాతా అనే నూతన దర్శకుడు రూపొందిస్తున్నారు. జియో స్టూడియోస్ దినేష్ విజన్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. కాగా.. ఈ సినిమా షూటింగ్ సోమవారం లాంఛనంగా ప్రారంభం అయింది. తొలిరోజే అభిషేక్ బచ్చన్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసింది యూనిట్.

ఈ పోస్టర్ లో అభిషేక్ బచ్చన్ లుక్ అద్భుతంగా ఉంది. టెన్త్ ఫెయిల్ అయిన గంగా రౌమ్ చౌదరి పాత్రలో కనిపించబోతున్నాడు అభిషేక్. ఆ విషయం క్లియర్ కట్ గా చూపించారు పోస్టర్లో. బ్యాగ్రౌండ్ లో గంగారామ్ ప్రోగ్రెస్ రిపోర్టును కూడా ఉంచడం విశేషం.

ఇక పోస్టర్లో అభిషేక్ రౌడీ పాత్రలో అద్భుతంగా ఒదిగిపోయినట్టు కనిపిస్తున్నాడు. రఫ్ లుక్ తో ఉన్న అభిషేక్.. చేతివేళ్లకు రెండు ఉంగరాలు.. మెడలో బ్లాక్ మఫ్లర్ తో ఈతరం విలన్ గా కనిపిస్తున్నాడు. అక్షరం ముక్క రాకపోయినా ముఖ్యమంత్రి అవ్వాలనే కలలు కనే పాత్రలో అభిషేక్ జీవించబోతున్నట్టుగా తెలుస్తోంది. ఈ చిత్రంలో అభిషేక్ బచ్చన్ సరసన యామి గౌతమ్ నిమ్రత్ కౌర్ నటిస్తున్నారు. యామీ గౌతమ్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్గా నటిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం ఆగ్రాలో జరుగుతోంది.

తన మూవీ ఫస్ట్ లుక్ ను సోషల్ మీడియాలో పోస్టు చేశారు అభిషేక్. దానికి ‘గంగా రామ్ చౌదరిని కలవండి’ అని క్యాప్షన్ పెట్టారు. అదేవిధంగా దాస్వి షూట్ మొదలైందని కూడా వెల్లడించారు. ఈ పోస్ట్ కు హృతిక్ రోషన్ కామెంట్ చేశాడు. లుక్ సూపర్ గా ఉందని ప్రశంసించాడు హృతిక్.
× RELATED దుష్యంత్ ను ప్రకటించిన శాకుంతలం టీం
×