అక్కడ గెలిచింది టీడీపీ కాదు జనసేన: కొడాలి నాని

పంచాయతీ ఎన్నికలు పార్టీల గుర్తుపై జరగవు. ఎవ్వరు గెలిచినా కూడా అధికార పార్టీ వైపే చూస్తారు. ఎందుకంటే అభివృద్ధి జరుగుతుందని..కాసిన్ని నిధులు వస్తాయని.. తాము అధికార పార్టీ గెలిచాక అభ్యర్థులు ప్రకటిస్తారు. కానీ ఏపీలో బలమైన టీడీపీ వైసీపీ ఉండడంతో ఎవ్వరూ పార్టీలు మారకుండా గట్టిగా నిలబడుతున్నారు.

ఇక పార్టీలు మాత్రం ఏ అభ్యర్థిగా ఏ పార్టీవాడైనా సరే వాడు మా పార్టీ వాడే అంటూ ప్రకటించుకొని గొప్పలు చెప్పుకోవడం సర్వసాధారణం.. తాజాగా ఏపీ ఫైర్ బ్రాండ్ మంత్రి కొడాలి నాని కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు.

తాజాగా జరిగిన పంచాయతీ ఎన్నికల్లో తన నియోజకవర్గంలోని వెణుతురుమిల్లి గ్రామంలో వైసీపీ అభ్యర్థి మీద గెలిచిన టీడీపీ అభ్యర్థి గెలిచాడని..ఇది మంత్రి నానికి అవమానం అని టీడీపీ నేతలు ప్రచారం చేశారు.

అయితే తాజాగా దీనిపై మంత్రి నాని స్పందించారు. వెణుతురుమిల్లిలో టీడీపీ అభ్యర్థిని నిలబెట్టలేదని.. అక్కడ పోటీ జనసేనకు వైసీపీకి మధ్యలో జరిగిందని.. అయితే పవన్ సామాజికవర్గానికి చెందిన 500 మంది గంపగుత్తగా జనసేనకు ఓటు వేయడంతో తమ పార్టీ అభ్యర్థి స్వల్ప ఓట్లతో ఓడిపోయాడని మంత్రి నాని తెలిపాడు. అక్కడ గెలిచింది టీడీపీ అన్న ప్రచారాన్ని మంత్రి తప్పు పట్టారు.

ప్రస్తుతం కొడాలి నాని గుడివాడ నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థులపై ఎవ్వరూ గెలిచినా ‘మంత్రి నానికి సొంత నియోజకవర్గంలో షాక్’ అంటూ వార్తలను హోరెత్తిస్తున్నారు. ఈ క్రమంలోనే నాని క్లారిటీ ఇస్తున్నాడు.
× RELATED బైడెన్ తన అధికార గణంలో మరో ఇద్దరు..మొత్తం 55 కి చేరిన సంఖ్య !
×