ఫేక్ కలెక్షన్స్ విమర్శలతో 100 కోట్ల పోస్టర్ ని పక్కన పెట్టారా..?

మెగా హీరో పంజా వైష్ణవ్ తేజ్ - కృతిశెట్టి జంటగా తెరకెక్కిన చిత్రం ''ఉప్పెన''. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ - సుకుమార్ రైటింగ్స్ ఈ చిత్రాన్ని రూపొందించాయి. ఇటీవల విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకుల మన్ననలను అందుకోవడంతో పాటు మంచి వసూళ్ళు రాబడుతోంది. హీరోహీరోయిన్ల నటన - విజయ్ సేతుపతి - దేవిశ్రీ ప్రసాద్ అందించిన సంగీతం ఈ సినిమాకు ప్లస్ అయ్యాయి. సక్సెస్ కి కారణాలేవైనా నిర్మాతల్లో ఒకరైన సుకుమార్ 'ఉప్పెన' 100 కోట్ల సినిమా అవుతుందని స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు. దీనికి తగ్గట్టుగానే ఈ సినిమా ఫస్ట్ వీక్ లోనే 70 కోట్లు వసూలు చేసినట్లు మేకర్స్ అధికారికంగా పోస్టర్ కూడా రిలీజ్ చేశారు.

వాస్తవానికి 'ఉప్పెన' సినిమా ఇప్పటి వరుకు థియేటర్స్ నుంచి దాదాపుగా 65 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. అంటే సుమార్ 32 కోట్లు షేర్ రాబట్టినట్లు అవుతుంది. లెక్కలు చూసుకుంటే ఈ సినిమా ఆల్రేడీ లాభాల్లోనే ఉంది. నాన్ థియేట్రికల్ రైట్స్ ద్వారా సుమారు 20 కోట్లు వచ్చినా ఈ సినిమా 50 కోట్లు తెచ్చిపెట్టినట్లేనని చెప్పవచ్చు. ఇకపోతే సక్సెస్ ఫుల్ గా సెకండ్ వీక్ లో అడుగుపెట్టిన ఈ సినిమా వంద కోట్లు కలెక్ట్ చేస్తుందా లేదా అనేది పక్కనపెడితే సుక్కూ స్టేట్మెంట్ తో చిత్ర యూనిట్ 100 కోట్ల పోస్టర్ కూడా రెడీ చేసుకున్నారట. అయితే ఇటీవల కలెక్షన్స్ ఫేక్ చేస్తున్నారనే విమర్శలు రావడంతో 100 కోట్లు పోస్టర్ ని ప్రస్తుతానికి వేయకూడదని మైత్రీ అండ్ టీమ్ నిర్ణయించుకున్నట్లుగా సినీ వర్గాల్లో టాక్ నడుస్తోంది.
× RELATED దుష్యంత్ ను ప్రకటించిన శాకుంతలం టీం
×