పెళ్లి మండపాల్లో పోలీసులు.. కర్ణాటక కీలక నిర్ణయం

మహమ్మారి వెళ్లిపోయిందని రిలాక్స్ అవుతున్న వారికి షాకిస్తూ.. కరోనా కేసులు మళ్లీ పెరిగిపోతున్న వైనం తెలిసిందే. దేశంలోని కొన్ని రాష్ట్రాలు.. ముఖ్యంగా కేరళ.. మహారాష్ట్ర.. తమిళనాడు తదితర రాష్ట్రాల్లో పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. దీంతో.. ఆ చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాలు మరింత అలెర్టు అవుతున్నాయి. ఎన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నా.. కేరళ రాష్ట్రంలో కరోనా కేసులు భారీగాపెరిగిపోతున్నాయి. దీంతో.. ఈ రాష్ట్రంలో సరిహద్దులున్న కర్ణాటక పూర్తిగా అలెర్టు అవుతోంది. పలు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది.

కరోనా దెబ్బకు తీవ్రంగా ఇబ్బంది పడిన కర్ణాటక.. మరోసారి అలాంటి పరిస్థితులు చోటుచేసుకోకుండా ఉండేందుకు వీలుగా ఇప్పటికే పలు కఠిన నిర్ణయాలు తీసుకున్నారు. కేరళ నుంచి వచ్చే వారిని ప్రత్యేకంగా స్క్రీనింగ్ చేసిన తర్వాత మాత్రమే.. అనుమతిస్తున్నారు. తాజాగా కర్ణాటక ప్రభుత్వం మరో కీలక నిర్ణయాన్ని తీసుకుంది. ఇకపై.. పెళ్లి మండపాల్లో పోలీసుల్ని ఉంచాలని నిర్ణయించింది. కరోనా కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో.. పెళ్లిళ్లు లాంటి వేడుకులకు 500 మందికి మించి హాజరు కాకూడదన్న నిర్ణయాన్ని తీసుకుంది.

తమ నిర్ణయం ఎంతలా అమలవుతుందన్న విషయాన్ని గుర్తించేందుకు వీలుగా మార్షల్స్ ను రంగంలోకి దించాలని డిసైడ్ అయ్యింది. 500 మందికి మించి జనాభా ఎక్కుడా చేరటానికి వీల్లేదని.. ప్రతి ఒక్కరూ మాస్క్ ను తప్పనిసరిగా వినియోగించాలని రాష్ట్ర ఆరోగ్య మంత్రి సుధాకర్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో మరెక్కడా 500 మందికి మించిన జనాభా ఒక్కచోట చేరకూడదని.. అందులో భాగంగానే పెళ్లి మండపాల్లో పోలీసుల్ని ఉంచి పర్యవేక్షిస్తామని చెబుతున్నారు. తాజా లెక్కల ప్రకారం కర్ణాటకలో ఇంకా కరోనాతో ఆరు వేల మంది బాద పడుతున్నట్లు చెబుతున్నారు. చూస్తుంటే.. ఈ తరహా ముందస్తు జాగ్రత్తల్ని రెండు తెలుగురాష్ట్రాలు ఫాలో కావాల్సిన అవసరం ఉంది కదూ?
× RELATED డీజీసీఏ గుడ్ న్యూస్ : లగేజ్ లేకపోతే..విమాన టికెట్ పై డిస్కౌంట్!
×