ఇండిపెండెన్స్ డే వార్! అతడితో `పుష్ప` ఢీ అంటే ఢీ!!

సౌత్ స్టార్ హీరోలను బాలీవుడ్ కూడా ఛాలెంజర్స్ జాబితాలో చేర్చి గౌరవిస్తోంది. బాహుబలితో ప్రభాస్ ప్రభజనం అనంతర పరిణామమిది. తాజా సన్నివేశంలో రామ్ చరణ్ - తారక్ ఆర్.ఆర్.ఆర్ తో బాలీవుడ్ లో అడుగుపెడుతుండడం.. అలాగే పుష్ప చిత్రంతో బన్ని కూడా బాలీవుడ్ ని ఢీకొడుతుండడం చూస్తుంటే వార్ ఏ రేంజులో ఉందో అర్థం చేసుకోవచ్చు. అక్కడ ఖాన్ లే కాకుండా ఇతర స్టార్ హీరోలు నేటితరం హీరోలు కూడా టాలీవుడ్ స్టార్లను అభిమానిస్తున్నారు. మన స్టార్ల సత్తాను అంచనా వేస్తున్నారు.

ప్రస్తుతం ప్రతిష్ఠాత్మక ఆర్.ఆర్.ఆర్ రిలీజ్ సమయంలో బాలీవుడ్ రిలీజ్ ల విషయమై చర్చ సాగుతోంది. అలాగే బన్ని నటించిన పుష్ప ఏ సినిమాని ఢీకొట్టబోతోంది? అన్నది కూడా ఆసక్తిగా మారింది. ఆగస్టు 13 న స్వాతంత్ర దినోత్సవం కానుకగా అల్లు అర్జున్ నటించిన పుష్ప రిలీజవుతోంది. అదే సమయానికి జాన్ అబ్రహాం ఎటాక్ కూడా రిలీజ్ కానుంది. ఈ రెండిటిలో ఏది క్రేజీ సినిమా? అంటే.. పుష్ప పేరు అక్కడ ప్రముఖంగా వినిపిస్తోంది. ఇటీవల జాన్ అబ్రహాం ట్రాక్ రికార్డ్ బావున్నా.. బన్ని లాంటి పాన్ ఇండియా అప్పీల్ ఉన్న స్టార్ హీరో .. సుక్కూ లాంటి స్టార్ డైరెక్టర్ కలయికను ఎవరూ అంత తక్కువగా అంచనా వేయలేదు.

సుకుమార్ తెరకెక్కించిన రంగస్థలం ఇంతకుముందు కేవలం తెలుగు భాష వరకే రిలీజైనా 200కోట్లు వసూలు చేసింది. ఒకవేళ పాన్ ఇండియా కేటగిరీలో హిందీలోనూ స్ట్రెయిట్ గా రిలీజైతే ఇంకా ఏ స్థాయిలో వసూలు చేసేదో అన్న చర్చా సాగింది. ప్రస్తుతం బాలీవుడ్ ట్రేడ్ ఇవన్నీ పరిశీలిస్తోందని సమాచారం.

ఎటాక్ వర్సెస్ పుష్ప! ఘర్షణను బాలీవుడ్ ట్రేడ్ ఆసక్తికరంగా విశ్లేషిస్తోంది. రెండు సినిమాలను పోల్చి చూస్తే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్  మూవీ  ఆకర్షణీయమైన తారాగణంతో వేడి పెంచుతోంది. ఇది అల్లు అర్జున్  మొట్టమొదటి పాన్ ఇండియన్ చిత్రం అయినా.. ఇప్పటికే అతడికి పాన్ ఇండియా స్థాయి ఫ్యాన్స్ ఉన్నారు. అందుకే బాలీవుడ్ నిశితంగా పుష్ప సినిమాని పరిశీలిస్తోంది. ఇక కేరళలోనూ బన్ని సినిమా స్ట్రెయిట్ సినిమాలకు ధీటుగా పోటీపడనుంది.
× RELATED దుష్యంత్ ను ప్రకటించిన శాకుంతలం టీం
×