వెంకీతో `దృశ్యం 2`.. లాల్ తో `దృశ్యం 3`కి అతడే..!

సూపర్ స్టార్ మోహన్ లాల్ - మీనా ప్రధాన పాత్రలు పోషించిన దృశ్యం మలయాళంలో సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత తెలుగు-తమిళంలోనూ రీమైకై పెద్ద హిట్టు కొట్టింది. తొలి భాగం బ్లాక్ బస్టర్ కొట్టాక దృశ్యం 2 ని ప్రకటించారు. ఇటీవల అమెజాన్ ప్రైమ్ లో దృశ్యం 2 రిలీజై విజయం సాధించింది.

పార్ట్ 2ని కూడా జీతూ జోసెఫ్ ఎంతో ఎమోషనల్ డ్రామాతో తెరకెక్కించారని టాక్ వినిపించింది. ఓటీటీలో చక్కని ఆదరణ దక్కించుకుంటోంది. ఆ క్రమంలోనే ఇప్పుడు పార్ట్ 3ని కూడా తెరకెక్కించేందుకు సన్నాహాలు చేయనున్నారు.

తొలి రెండు సినిమాల్ని తెరకెక్కించిన జీతూనే ఇప్పుడు పార్ట్ 3కి కూడా దర్శకత్వం వహించనున్నారు. మంచి కాస్టింగ్ ఎంపిక ఉంటుందని ఆయన ప్రకటించారు. ఇప్పటికే విజయం సాధించిన దృశ్యం 2లో నటించేందుకు విక్టరీ వెంకటేష్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా దీనికి కూడా జీతూ జోసెఫ్ దర్శకత్వం వహిస్తారని సమాచారం. ఇరుగు పొరుగు భాషల్లోనూ ప్రపోజల్స్ లో కాస్టింగ్ కుదిరితే రీమేకయ్యే వీలుంది.

జార్జ్ కుట్టి తన కుటుంబం కోసం ఎప్పుడూ ప్రమత్తంగానే ఉండాలి. రాబోయే ఆపదను కనిపెట్టి కుటుంబాన్ని కాపాడుకోవాలి!! అన్న ముగింపుతో సీక్వెల్ రక్తి కట్టించింది. అప్పుడే పార్ట్ 3 ఉంటుందని ప్రేక్షకులు అంచనా వేశారు. ఎట్టకేలకు దర్శకుడే మూడో భాగం గురించి ప్రకటించారు.
× RELATED ఐదు తెలుగు సినిమాలకు సైన్ చేసినట్లు వెల్లడించిన 'హార్ట్ ఎటాక్' బ్యూటీ..!
×