స్టైలిష్ పోస్టర్ తో 'మోసగాళ్ళు' అప్డేట్ ఇచ్చిన మంచు విష్ణు..!

మంచు విష్ణు హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా మూవీ ''మోసగాళ్ళు''. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ - ఏవీఏ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై మంచు విష్ణు స్వయంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. హాలీవుడ్ డైరెక్టర్ జెఫ్రీ గీ చిన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఐటీ కుంభకోణం నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని మార్చి నెలలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రచార కార్యక్రమాల స్పీడ్ పెంచిన మేకర్స్ టీజర్ - సాంగ్స్ తో సినిమాపై ఆసక్తిని కలిగించారు. ఈ క్రమంలో 'మోసగాళ్ళు' థియేట్రికల్ ట్రైలర్ ని విడుదల చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు.

ఫిబ్రవరి 25 న ఈ సినిమాకు సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ ను విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ లో విష్ణు క్లాస్ గా స్టైలిష్ గా కనిపిస్తున్నాడు. హై ఆక్టేన్ యాక్షన్ థ్రిల్లర్ గా నిర్మించబడిన 'మోసగాళ్ళు' చిత్రాన్ని తెలుగు తమిళం మలయాళం కన్నడ మరియు హిందీ భాషలలో విడుదల చేయనున్నారు. ఇందులో విష్ణు సోదరిగా స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్  కనిపిస్తుంది. రుహీ సింగ్ హీరోయిన్ గా నటిస్తుండగా.. బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి ఈ సినిమాతో టాలీవుడ్ కు పరిచయమవుతున్నాడు. షెల్డన్ చౌ సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ చిత్రానికి గౌతమ్ రాజు ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు. సామ్ సీఎస్ సంగీతం సమకూరుస్తున్నాడు.
× RELATED ఎర్ర మిర్చి రెడ్ ఫ్లేమ్ అంటూ యాంకర్ వెంట పడ్డారు!
×