కేజీఎఫ్-2 తెలుగు రైట్స్.. బాప్ రే అన్ని కోట్లా..?

దేశవ్యాప్తంగా  ఇండియన్ ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్న సినిమాల్లో ముందు వరసలో ఉంది ‘కేజీఎఫ్-2’. కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా.. దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ భారీ యాక్షన్ థ్రిల్లర్ మొదటి పార్టు అద్భుతమైన విజయం సాధించింది. దీంతో సెకండ్ పార్ట్ పై ఓ రేంజ్ లో హైప్ క్రియేటయ్యింది.

ఈ హైప్ ను క్యాష్ చేసుకునే పనిలో పడ్డారు మేకర్స్. ఎంత ధర నిర్ణయించినా.. కేజీఎఫ్-2ను హాట్ కేకులా అందుకునేందుకు చూస్తున్నారట పంపిణీదారులు! దీంతో.. ఈ చిత్ర బిజినెస్ ఆకాశాన్ని తాకుతున్నట్టుగా వార్తలు వింటూనే ఉన్నా. దేశంలోని అన్ని ప్రధాన భాషల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది.

ఈ క్రమంలో తెలుగు హక్కులకు కూడా తీవ్ర పోటీ నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని సొంతం చేసుకునేందుకు డిస్ట్రిబ్యూటర్లు ఎంత చెల్లించడానికైనా సిద్ధంగా ఉన్నారనే ప్రచారం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఓ ఇంట్రస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది. కన్నడ సినీ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ సినిమా తెలుగు హక్కులను దిల్ రాజు సొంతం చేసుకున్నారట. ఇందుకు గానూ రూ.66 కోట్లు చెల్లించినట్టు తెలుస్తోంది.

మరి ఈ వార్తలో ఎంతవరకూ నిజముందో కానీ.. అటు శాండవుల్ ఉడ్ ఇటు టాలీవుడ్ లో మాత్రం న్యూస్ వైరల్ అయ్యింది. తొలి పార్టు ఘనవిజయం ఆ తర్వాత టీజర్ ప్రపంచ రికార్డు నెలకొల్పడం వంటి కారణాలతో కేజీఎఫ్-2పై భారీ అంచనాలు నెలకొన్నాయి. దీంతో.. పంపిణీదారులు కూడా వెనకడాట్లేదు. కాగా.. ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా జూలై 16న గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది.
× RELATED అల్ట్రా స్లిమ్ లుక్ తో జివ్వనిపిస్తున్న అనూ
×