‘ఉప్పెన’ తొలి హీరోయిన్ కృతి కాదట?

‘ఉప్పెన’ మూవీ అంతలా ఊపేసిందంటే కారణం హీరోయిన్ కృతిశెట్టి అనడంలో ఎలాంటి సందేహం లేదు.కృతి అందం చందం ఆమె హావభావాలు ఈ సినిమాకు ఎంతో ప్లస్ అయ్యాయి. కుర్రకారు మదిని దోచాయి. స్వయంగా సక్సెస్ మీట్ లో మెగా పవర్ స్టార్ రాంచరణ్ సైతం ‘కృతి’ స్టార్ హీరోయిన్ అవుతుందని.. ఆమె డేట్స్ దొరకడం కూడా కష్టమేనని అన్నాడంటే ఆమెకు అంతకంటే కాంప్లిమెంట్ లేదు.

అయితే నిజానికి ఉప్పెన సినిమాలో మొదట కృతిశెట్టి హీరోయిన్ కాదు. సునీల్ హీరోగా నటించిన ‘2 కంట్రీస్’లో కథానాయికగా నటించిన మనీషా రాజ్ అనే తెలుగు అమ్మాయిని ‘ఉప్పెన’కు హీరోయిన్ గా మొదట బుచ్చిబాబు ఎన్నుకున్నాడట.. ఉప్పెన ప్రారంభోత్సవంలోనూ మనీషానే పాల్గొంది.

కానీ అనుకోకుండా ఓ రోజు ఫేస్ బుక్ లో దర్శకుడు బుచ్చిబాబు ‘కృతి ఫొటోలు’ చూసి ఫిదా అయిపోయాడట.. తన కథలో బేబమ్మ పాత్రకు ఈ అమ్మాయి కరెక్ట్ అనుకున్నాడట.. మొదట తెలుగమ్మాయి బాగుంటుందని మనీషను ఎంపిక చేసుకోగా..  కృతి నచ్చడంతో డైలామాలో పడిపోయాడట.. వెంటనే తన గురువు సుకుమార్ ను సలహా అడిగాడట.. నీకు నచ్చింది చేయమని.. కథ విషయంలో కాంప్రమైజ్ కావద్దని సుకుమార్ చెప్పడంతో మనీషను తప్పించి కృతిని తీసుకున్నారట..

కృతి ఈ సినిమాకు తన నటన హావభావాలతో ప్రాణం పోసింది. సినిమా హిట్ లో భాగమైంది. బుచ్చిబాబు నిర్ణయమే సరైందని నిరూపితమైంది. కృతి జీవితాన్నే ‘ఉప్పెన’ మూవీ మార్చేసిందన్నమాట..
× RELATED దుష్యంత్ ను ప్రకటించిన శాకుంతలం టీం
×