#రవితేజ 68 .. నారీ నారీ నడుమము రాజాధి రాజా!

మాస్ మహారాజా రవితేజ నటించిన క్రాక్ సంక్రాంతి బరిలో రిలీజై బ్లాక్ బస్టర్ విజయం అందుకున్న సంగతి తెలిసిందే. క్రాక్ తో ట్రాక్ లోకొచ్చాడు రాజా. ఆ తర్వాత చకచకా వరుస ప్రాజెక్టులతో బిజీ అయిపోతున్నాడు.

ప్రస్తుతం ఖిలాడీ చిత్రీకరణలో బిజీగా ఉన్న రవితేజ తదుపరి రవితేజ 68 వ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించేశారు. ఈ మూవీ ముహూర్త వేడుక త్వరలో జరుగుతుంది. ప్రస్తుతం భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ ఖిలాడీ చిత్రీకరణను శరవేగంగా పూర్తి చేస్తున్నారు. తదుపరి వెనువెంటనే రెగ్యులర్ షూట్ ప్రారంభమవుతుంది. ఈసారి త్రినాధ రావు నక్కినతో కామెడీ యాక్షన్ ఎంటర్ టైనర్ కోసం రవితేజ ప్లాన్ చేస్తున్నారు.

తాజా సమాచారం ప్రకారం.. ఇంకా టైటిల్ నిర్ణయించని ఈ చిత్రంలో రవితేజ ఇద్దరు యంగ్ బ్యూటీస్ తో రొమాన్స్ చేయనున్నారు. మలయాళ నటి ఐశ్వర్య మీనన్ .. కన్నడ బ్యూటీ శ్రీలీలా ఈ చిత్రంలో కథానాయికలుగా నటించనున్నారు. ఐశ్వర్య ఇంతకుముందు లవ్ ఫెయిల్యూర్ అనే తెలుగు చిత్రంలో నటించగా.. శ్రీలీలా పెళ్లి సందD లో నటిస్తున్నారు. తాజా ఆఫర్ ఆ ఇద్దరికీ రెండవ  తెలుగు సినిమా అనే చెప్పాలి.

పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ- అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. టిజి విశ్వ ప్రసాద్- అభిషేక్ అగర్వాల్ నిర్మాతలు. వివేక్ కుచిబోట్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తారు. ఇతర టెక్నీషియన్ల వివరాలు వెల్లడి కావాల్సి ఉంది.
× RELATED ఎర్ర మిర్చి రెడ్ ఫ్లేమ్ అంటూ యాంకర్ వెంట పడ్డారు!
×