'క్షణ క్షణం' సినిమాతో కమర్షియల్ హీరో అనిపించుకుంటాడా..?

'ఆటగదరా శివ' అనే వైవిధ్యమైన సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు ఉదయ్ శంకర్. ఆ తర్వాత హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ తో కలిసి నటించిన 'మిస్ మ్యాచ్' ఫీల్ గుడ్ లవ్ స్టోరీగా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ క్రమంలో ఇప్పుడు మరో ప్రయోగాత్మక సినిమా ''క్షణ క్షణం'' తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు ఉదయ్ శంకర్. వైజాగ్ బ్యాగ్ డ్రాప్ లో రూపొందిన ఈ చిత్రంలో 'సత్య' అనే పాత్రలో ఉదయ్ కనిపించనున్నాడు.

కార్తిక్ మేడికొండ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. మన మూవీస్ బ్యానర్ పై వర్లు - చంద్రమౌళి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా ఫిబ్రవరి 26న గీతా ఫిలింస్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన సాంగ్స్ మరియు ట్రైలర్ ఈ సినిమాపై ఆసక్తిని కలిగించాయి. 'క్షణ క్షణం' సినిమాతో టాలీవుడ్ లో కమర్షియల్ హీరోగా గుర్తింపు తెచ్చుకోడానికి ప్రయత్నిస్తున్న ఉదయ్ శంకర్ ఎంత వరకు సక్సెస్ అవుతాడో చూడాలి.

ఇకపోతే ఈ చిత్రంలో ఉదయ్ శంకర్ సరసన 'అర్జున్ రెడ్డి' ఫేమ్ జియా శర్మ హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రానికి సంగీత దర్శకుడు కోటి తనయుడు రోషన్ సాలూరి సంగీతం సమకూరుస్తున్నాడు. ఈ చిత్రంలో సంగీత దర్శకులు రఘు కుంచె - కోటి.. రవి ప్రకాష్ - శ్రుతి సింగ్ ఇతర ప్రధాన పాత్రలు పోషించారు.
× RELATED ఎర్ర మిర్చి రెడ్ ఫ్లేమ్ అంటూ యాంకర్ వెంట పడ్డారు!
×