మెగాస్టార్ చిరంజీవి 152వ సినిమాగా తెరకెక్కుతున్న ఆచార్య మూవీపై
రోజురోజుకి ప్రేక్షకులలో అంచనాలు పెరిగిపోతున్నాయి. మరోవైపు సినిమా ఎప్పుడు
పూర్తవుతుందో అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఎంతో ప్రతిష్ఠాత్మకంగా
తెరకెక్కుతున్న ఈ సినిమాను మాట్నీ ఎంటర్టైన్మెంట్ కొణిదెల ప్రొడక్షన్స్
సంయుక్తంగా నిర్మిస్తుండగా.. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం
వహిస్తున్నాడు. ఈ సినిమాకు ఆచార్య అనే టైటిల్ ప్రకటించినప్పటి నుండి సినిమా
గురించి ఏదొక వార్త రోజు వినిపిస్తూనే ఉంది. ఇప్పటికే చాలావరకు ఈ చిత్ర
షూటింగ్ పూర్తయిందట. అయితే ఈ సినిమా కమర్షియల్ ఎలిమెంట్స్ తో సామాజిక
అంశాలు టచ్ చేస్తుందని తెలిసిందే. ఇక ఈ సినిమాలో చిరుకి జోడీగా కాజల్
అగర్వాల్ నటిస్తోంది. అయితే ఈ సినిమాలో రాంచరణ్ కూడా కీలకపాత్ర
పోషిస్తున్నాడు. మెగాస్టార్ రాంచరణ్ కలిసి గతంలో రెండు మూడు సినిమాలలో
కనిపించారు. కానీ నిడివిగల పాత్రలు చేయలేదు.
అయితే ఈ సినిమాలో రాంచరణ్ పాత్ర నిడివితో ఉంటుందని కొరటాల వెల్లడించాడు. అలాగే చరణ్ జోడిగా హీరోయిన్ ఉంటుందని తెలిపారు. ఇంతకాలం ఆ హీరోయిన్ని వెతికే పనిలో పడింది చిత్రబృందం. తాజాగా స్టార్ హీరోయిన్ పూజా హెగ్డేను ఓకే చేసింది బృందం. మొన్నటి వరకు చరణ్ జోడిగా సమంత కియారా రష్మికల పేర్లు వినిపించాయి కానీ ఆఖరికి పూజా కన్ఫర్మ్ అయింది. అయితే పూజా ప్రస్తుతం మోస్ట్ బిజీ హీరోయిన్ గా మారింది. ప్రభాస్ అఖిల్ సల్మాన్ రన్వీర్ సింగ్ సినిమాలతో ఖాళీ లేకుండా ఉంది. కానీ ఈ సినిమాకు ఒప్పుకుంది అంటే మాత్రం ఏదో మేటర్ ఉండే ఉంటుంది కదా! అమ్మడు ఆచార్య సినిమాలో తక్కువ నిడివి గల పాత్ర చేస్తోంది. కానీ పేమెంట్ మాత్రం ఫుల్ గా డిమాండ్ చేసిందట. అయితే మాములుగా సినిమా మొత్తానికి తీసుకునే పారితోషికం పూజా డిమాండ్ చేయడంతో చేసేదేం లేక మేకర్స్ కూడా అంగీకరించినట్లు సమాచారం. చూడాలి మరి రాంచరణ్ సరసన పూజా జిగేల్ రాణిగా చిందులేసింది. మరి ఈసారి ఈ జంట ఎలా అలరిస్తుందో!