తండ్రికి హీరో విజయ్ కోర్టు నోటీసు.. నా ఫొటో వాడొద్దంటూ..

తమిళ్ స్టార్ హీరో ఇళయదళపతి విజయ్ తన తండ్రి ఎస్.ఏ.చంద్రశేఖర్కు లీగల్ నోటీసులు జారీచేశారట. ఈ మేరకు కోలీవుడ్ లో జోరుగా ప్రచారం సాగుతోంది. తన న్యాయవాది కుమరేశన్ ద్వారా విజయ్ ఈ నోటీసులను పంపించినట్టు సమాచారం. ఈ నోటీసులు పంపించాల్సిన అవసరం ఎందుకొచ్చిందో కూడా అందులో వివరించారు.

''గత జూన్ నెల 8వ తేదీన 'అఖిల భారత దళపతి విజయ్ మక్కల్ ఇయ్యక్కం' అనే పేరుతో మీరు (ఎస్.ఏ.చంద్రశేఖర్) ఓ రాజకీయ పార్టీని రిజిస్టర్ చేయించారు. ఈ చర్యను ఖండిస్తూ.. విజయ్ అపుడే ఓ ప్రకటన కూడా విడుదల చేశారు. మీరు చేపట్టిన పనులకు విజయ్ తన మద్దతు ప్రకటించలేదు. కాబట్టి మీరు స్థాపించిన పార్టీలో విజయ్ పేరుగానీ ఫొటో వాడకూడదు. దీన్ని ఉల్లంఘించినట్టయితే న్యాయపరంగా చర్యలు తీసుకుంటాం'' అని విజయ్ తరపు న్యాయవాది పంపించిన నోటీసులో పేర్కొన్నారు.

ఈ వార్త ఇప్పుడు తమిళనట హాట్ టాపిక్ గా మారింది. విజయ్ తన తండ్రికే నోటీసులు పంపడంపై అందరూ ఆశ్చర్యం వ్యక్తంచేస్తున్నారు. విజయ్ పాలిటిక్స్ లో రావాలని చూస్తున్నారని కొంత కాలంగా ప్రచారం సాగుతున్న విషయం తెలిసిందే. పైన చెప్పిన విజయ్ మక్కల్ ఇయ్యక్కం అనేది ఇళయదళపతి అభిమాన సంఘం పేరు. ఈ పేరుతో తన తండ్రి రాజకీయ పార్టీ రిజిస్టర్ చేయించడం.. దాన్ని విజయ్ లీగల్ గా సవాల్ చేయడం ఆసక్తిగా మారింది.

చట్టపరంగా తండ్రిని ఎదుర్కొంటున్నాడంటే.. క్షేత్రస్థాయిలో తండ్రీ కొడులకు ఏ స్థాయిలో చెడిందో అర్థమవుతోందని అంటున్నారు పలువురు.మరి ఈ పరిణామంతో తండ్రి చంద్రశేఖర్ ఎలాంటి స్టెప్ తీసుకుంటారు? తన రాజకీయ ఎంట్రీపై విజయ్ ఏమైనా స్టాండ్ ప్రకటిస్తాడా? అన్నది కోలీవుడ్ లో ఆసక్తికరంగా మారింది.
× RELATED స్టార్ హీరోయిన్ సినిమాలకు లాంగ్ బ్రేక్ చెప్పనుందా..??
×