నాని Vs చై: బిజినెస్ బిజినెస్సే బామ్మర్ధి బామ్మర్ధే!

ఒకే రిలీజ్ తేదీని పోటీ పడి లాక్ చేస్తే అది రెవెన్యూ షేరింగ్ కి దారి తీస్తుందనే అర్థం. ఓపెనింగుల్లో షేరింగ్ ఉంటుంది.. లాంగ్ రన్ లోనూ ఎవరి షేర్ వాళ్లకు ఉంటుంది. అలా కాకుండా ఒకే రిలీజ్ తేదీకి ఒక్క సినిమానే వస్తే వేగంగా రికవరీ ఉంటుంది. ఓపెనింగులు పెద్ద స్థాయిలో వర్కవుటవుతుంది. ఇన్నాళ్ల అనుభవం ఇదే.

కానీ ఇద్దరు క్రేజీ స్టార్లు నటిస్తున్న సినిమాలు ఏప్రిల్ 16 తేదీని పంచుకోవడంపై టాలీవుడ్ ఇన్ సైడ్ ఆసక్తికర చర్చ సాగుతోంది. నాని నటిస్తున్న టక్ జగదీష్ చిత్రం ఏప్రిల్ 16న రిలీజ్ ఫిక్స్ చేసుకోగా.. సడెన్ గా నాగచైతన్య `లవ్ స్టోరి` రిలీజ్ కి అదే తేదీని ఫిక్స్ చేయడం హాట్ టాపిక్ గా మారింది. మజిలీ లాంటి బ్లాక్ బస్టర్ తో స్పీడ్ మీదున్న నాగచైతన్య కమ్ముల దర్శకత్వంలో లవ్ స్టోరి చేస్తున్నారు. కానీ నానీపైనే పోటీ ఎందుకు అన్న చర్చ మొదలైంది.

అయితే ఈ పోటీ వెనక ప్రముఖ పంపిణీదారుడు కం ఎగ్జిబిటర్ కం అగ్ర నిర్మాత ఉన్నారన్న చర్చ కూడా వేడెక్కిస్తోంది. నిజానికి నాని.. నాగచైతన్య ఇద్దరితోనూ అతడికి సత్సంబంధాలు ఉన్నా.. తాను పంపిణీ చేసే లేదా నిర్మించే సినిమాలకే ప్రాధన్యత కావాలని అనుకుంటున్నారు అన్న గుసగుసా వేడెక్కిస్తోంది. అయితే ఈ క్లాష్ ని హీరోలో తెలివిగా పరిష్కరించుకోవాల్సి ఉంటుంది. నాని కొంత నిరాశపడినా మాట్లాడుకుని పరిస్థితిని చక్కదిద్దుకుంటాడని భావిస్తున్నారు. కానీ బిజినెస్ బిజినెస్సే.. బామ్మర్థి బామ్మర్థే అనుకునే ఇండస్ట్రీలో ఏం జరుగుతుందో చూడాలి.
× RELATED స్టార్ హీరోయిన్ సినిమాలకు లాంగ్ బ్రేక్ చెప్పనుందా..??
×