పవర్ స్టార్ కెరీర్ లో కాస్ట్లీ సినిమా అదే..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తూనే బ్యాక్ టు బ్యాక్ సినిమాలు లైన్ లో పెట్టాడు. ఇప్పటికే వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ‘పింక్’ రీమేక్ 'వకీల్ సాబ్' సినిమాని పూర్తి చేశాడు. దిల్ రాజు - బోనీకపూర్ కలసి నిర్మించిన ఈ చిత్రాన్ని ఏప్రిల్ 9న విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక పవన్ ఇటీవలే 'అయ్యప్పనుమ్ కోశీయుమ్' తెలుగు రీమేక్ స్టార్ట్ చేసాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే-డైలాగ్స్ అందిస్తున్న ఈ చిత్రానికి సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో రూపొందే ఈ చిత్రాన్ని ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ఛాన్స్ ఉంది. మొత్తం మీద పవన్ నటించిన రెండు సినిమాలు ఒకే ఏడాదిలో రిలీజ్ కానున్నాయి.

ఇకపోతే జాగర్లమూడి క్రిష్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ ఓ పీరియాడికల్ మూవీ చేయనున్నాడు. ఇప్పటికే ఓ షెడ్యుల్ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని స్టార్ ప్రొడ్యూసర్ ఏయమ్ రత్నం నిర్మిస్తున్నాడు. మొఘలాయుల కాలం నాటి ఫిక్షనల్ స్టోరీతో వస్తున్న ఈ చిత్రంలో పవన్ వజ్రాల దొంగగా కనిపిస్తాడని సమాచారం. ఈ చిత్రానికి ‘విరూపాక్ష’ అనే టైటిల్ పరిశీలనలో ఉంది. దీని కోసం సుమారు 160 కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నారట. ఎక్కువ భాగం సెట్స్ లో షూటింగ్ చేసుకునే ఈ చిత్రంలో గ్రాఫిక్స్ కి కూడా ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. ఇప్పటికే అల్యూమినియం ఫ్యాక్టరీలో చార్మినార్ సెట్.. హైదరాబాద్ శివార్లలో ఓ దర్బార్ సెట్ వేస్తున్నారని సమాచారం. ఇది పవన్ కెరీర్ లోనే అత్యధిక బడ్జెట్ తో రూపొందే సినిమా అని తెలుస్తోంది. అందుకే ముందుగా 'ఏకే' రీమేక్ ని కంప్లీట్ చేయాలని పవన్ నిర్ణయించుకున్నాడు. ఏదేమైనా పవన్ తన కెరీర్ లోనే ఎప్పుడూ లేనంత స్పీడ్ గా సినిమాలు అనౌన్స్ చేయడంతో పాటు షూటింగ్ కూడా చేసేస్తున్నాడు.


× RELATED అల్ట్రా స్లిమ్ లుక్ తో జివ్వనిపిస్తున్న అనూ
×