పంజాబ్ హర్యానాలో మొబైల్ ఇంటర్నెట్ బంద్..!

రైతుల ఆందోళనతో దేశ రాజధాని అట్టుడుకుతున్నది. నిన్నటి రైతన్న ఆందోళన హింసాత్మకం అయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్రప్రభుత్వం అలర్ట్ అయ్యింది. పంజాబ్ హర్యానాలో ఉద్యమం తీవ్రరూపం దాల్చకముందే పరిస్థితిని అదుపులోకి తీసుకురావాలని చూస్తున్నది. ఇందుకోసం ఆ రెండు రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఇంటర్నెట్ మొబైల్ సేవలు నిలిపివేశారు. అయితే కేవలం పంజాబ్ హర్యానాకు చెందిన రైతులే రైతు ఆందోళనలో పాల్గొన్నట్టు కేంద్రం భావిస్తున్నది. జనవరి 26న ఎర్రకోటపై రైతులు జెండాలు ఎగరవేసిన అంశం ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. అంతర్జాతీయ మీడియా సైతం ఈ ఆందోళనను కవర్ చేసింది.

ఈ నేపథ్యంలో పంజాబ్ హర్యానా రాష్ట్రాల్లో ఉద్యమాన్ని ఉక్కుపాదంతో అణచివేయాలని కేంద్రం భావిస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే ఆయా రాష్ట్రాల్లో హై అలర్ట్ ప్రకటించారు. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలు సేవలు నిలిపివేయగా.. తాజాగా మొబైల్ సేవలు కూడా బంద్ చేశారు. అయితే పంజాబ్ హర్యానా రాష్ట్రంలో ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉన్నదని.. అయితే ఆందోళన కారులు ప్రభుత్వ ప్రైవేట్ ఆస్తులను ధ్వంసం చేసే అవకాశం ఉందని పోలీసులు అంచనా వేస్తున్నారు.

ఈ నేపథ్యంలో శాంతి భద్రతతలను అదుపులోకి తెచ్చేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నారు. అయితే ప్రస్తుతం ఢిల్లీలో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొన్నది. ఈ నేపథ్యంలో ఇప్పటికే పోలీసులు 15 కంపెనీల అదనపు బలగాలను దించారు. మరికొన్ని బలగాలు కూడా దించే అవకాశం ఉంది. సోనిపట్ ఝాజర్ పల్వాల్ జిల్లాల్లో ఇంటర్నెట్ సర్వీసులను నిలిపివేశారు. బుధవారం సాయంత్రం 5 గంటల వరకు టెలీకాం సర్వీసులు పనిచేయవని తెలిపారు. పరిస్థితిని సమీక్షించేందుకు హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేశారు.
× RELATED ఆ ఐటీ కంపెనీలో కొలువుల వరద .. త్వరలో 30 వేల జాబ్స్ భర్తీ !
×