'నేనేం చెయ్య' అంటూ 'ఎఫ్-సి-యూ-కే

సౌత్ సినీపరిశ్రమలో మోస్ట్ వాంటెడ్ యాక్టర్ ఎవరంటే జగపతి బాబు అని అలోచించకుండా చెప్పవచ్చు. హీరోగా ఇండస్ట్రీలో పరిచయమైన జగ్గూ.. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. హీరో అయినా క్యారెక్టర్ అయినా ఇట్టే మెప్పించగల జగ్గూ.. త్వరలోనే హీరోగా వెండి తెరపై మళ్ళీ  మెప్పించడానికి సిద్ధమవుతున్నాడు. ప్రస్తుతం జగ్గూ కథానాయకుడుగా నటించిన కంటెంట్-ఓరియెంటెడ్ మూవీ ఎఫ్‌సియుకె(ఫాదర్, చిట్టి, ఉమ్మా, కార్తీక్). ఇటీవల ఈ సినిమా నిర్మాణ పనులు పూర్తి చేసుకొని ఫిబ్రవరిలో గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతోంది. ఇదివరకు జగ్గూ హీరోగా నటించిన సినిమాలు సరైన ప్రమోషన్స్ లేక బోల్తా కొట్టాయి. కానీ ఎఫ్‌సియుకె నిర్మాతలు, శ్రీ రంజిత్ మూవీస్ ఈసారి గట్టి ప్రచారానికి నిర్ణయించుకున్నారు. అందుకే ఎఫ్‌సియుకె సినిమా ప్రమోషన్లలో భాగంగా సినిమాలోని ఒక్కో క్యారెక్టర్ రివీల్ చేసి బజ్ క్రియేట్ చేశారు.

ఇక తాజాగా ఈ సినిమా నుండి సెకండ్ లిరికల్ సాంగ్ విడుదల చేశారు. ఇప్ప‌టికే "ముఝ్‌సే సెల్ఫీ లేలో.." అంటూ సాగే ఫస్ట్ సింగల్ విడుదల చేయగా.. ఇప్పుడు "నేనేం చెయ్య‌.." అంటూ సాగే సెకండ్ లిరికల్ పాటను జిహెచ్ఎంసి ఆరోగ్య కార్య‌క‌ర్త‌లు, పారిశుద్ధ్య కార్మికులు విడుద‌ల చేయడం ఆశ్చర్యం. లాక్‌డౌన్ సమయంలో నిరంత‌రాయంగా పనిచేసి, ఆరోగ్య‌సేవ‌లు అందించిన ఆరోగ్య కార్య‌క‌ర్త‌లు, పారిశుద్ధ్య కార్మికుల‌కు ఈ విధంగా కృత‌జ్ఞ‌త‌లు తెలుపుకున్నారట చిత్రబృందం. ఇక జగపతి బాబు మాట్లాడుతూ.. ఆరోగ్య కార్య‌క‌ర్త‌లు, పారిశుద్ధ్య కార్మికులు 'నేనేం చెయ్య‌' పాట‌ను విడుద‌ల చేయ‌డం ఎంతో గౌర‌వంగా ఉంది. ఈ పాట‌ను అంద‌రూ ఎంజాయ్ చేస్తారు. త్వ‌ర‌లో మ‌రో రెండు పాట‌ల‌ను పోలీసు, మీడియా సిబ్బంది చేతుల మీదుగా విడుద‌ల చేస్తామ‌ని తెలియజేసారు దర్శకనిర్మాతలు. చూస్తుంటే ప్రేక్షకులను ఈ విధంగా థియేటర్లకు రప్పించే ప్రయత్నం చేస్తున్నారని టాక్.


× RELATED ఐదు తెలుగు సినిమాలకు సైన్ చేసినట్లు వెల్లడించిన 'హార్ట్ ఎటాక్' బ్యూటీ..!
×