మీమర్స్ గా మారిపోతున్న మెగా హీరోలు..!

ప్రస్తుతం సోషల్ మీడియాలో 'మీమ్స్' అనేవి ఓ ట్రెండ్. ఏదైనా విషయాన్ని ఇతరులకు చెప్పి నవ్వించడానికి పెద్ద పెద్ద స్టోరీస్ రాయాల్సిన అవసరం లేకుండా.. జస్ట్ ఓ బొమ్మ దాని కింద కొన్ని అక్షరాలతో నవ్విస్తుంటాయి మీమ్స్. అందుకే ఇప్పుడు అందరూ ఏదైనా సమాచారాన్ని త్వరగా రీచ్ అయ్యేలా చేయడం కోసం మీమర్స్ ని మార్గంగా ఎంచుకుంటున్నారు. ముఖ్యంగా సినిమా వాళ్ళు ఈ ట్రెండ్ ని బాగా ఫాలో అవుతున్నారు. సినిమా పబ్లిసిటీ చేసుకోడానికి తమని తాము పాపులర్ చేసుకోడానికి మీమ్స్ ని ఆశ్రయిస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు మెగా హీరోలు కూడా మీమర్స్ గా మారిపోయారనే టాక్ నడుస్తోంది.

తాజాగా మెగాస్టార్ చిరంజీవి 'ఆచార్య' టీజర్ అప్డేట్ విషయంపై చిరు - కొరటాల మధ్య సంభాషణ జరిగినట్లు ఫన్నీ మీమ్ తో వెల్లడించారు. 'ఆచార్య' టీజర్ న్యూ ఇయర్ కి ఇవ్వలేదు.. సంక్రాంతి కి లేదు.. ఇంకెప్పుడు?.. టీజర్ ఎప్పుడో చెప్పకపోతే లీక్ చేయడానికి నేను రెడీగా ఉన్నానంటూ చిరు ఫన్నీ మీమ్ పోస్ట్ చేశారు. ఇదే క్రమంలో 'ఆచార్య' టీజర్ అనౌన్సమెంట్ పై మెగా హీరో వరుణ్ తేజ్ స్పందిస్తూ మరో మీమ్ వేసాడు. 'చరణ్ అన్న వాయిస్ ఓవర్ అంటగా టీజర్ కి.. బయట టాక్' అంటూ బ్రహ్మానందం ఇమేజ్ తో వరుణ్ ఓ మీమ్ చేసి ట్వీట్ చేసాడు. దీంతో మెగా హీరోలందరూ మీమర్స్ గా మారిపోతున్నారని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం మెగా మీమ్స్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉన్నాయి.

అదే సమయంలో మెగా మీమ్స్ పై నెగిటివ్ కామెంట్స్ చేసేవారు కూడా లేకపోలేదు. మెగాస్టార్ రేంజ్ ని మర్చిపోయి ఇలా మీమ్స్ వేసి ప్రమోషన్ చేయడంపై మెగా అభిమానులకు పెద్దగా నచ్చలేదని తెలుస్తోంది. చిరంజీవి ఓ రేంజ్ లో చూసే ఫ్యాన్స్ ఇలా చిరునే స్వయంగా మీమ్స్ పోస్ట్ చేయడం ఏంటి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరోవైపు ట్రెండ్ కి తగ్గట్లుగా మెగాస్టార్ మారడంలో తప్పులేదని మద్దతుగా నిలుస్తున్న ఫ్యాన్స్ కూడా ఉన్నారు. అలానే స్వయంగా మీమ్స్ వేస్తూ మీమర్స్ పొట్ట కొడుతున్నారని నెట్టింట ఫన్నీ పోస్టులు ఎక్కువగా వస్తున్నాయి.
× RELATED అల్ట్రా స్లిమ్ లుక్ తో జివ్వనిపిస్తున్న అనూ
×