నెటిజన్లకు దొరికిపోయిన శిల్పాశెట్టి తాప్సీ.. ట్రోలింగే ట్రోలింగు!

సెలబ్రిటీలు కడు జాగ్రత్తతో వ్యవహరించాల్సి ఉంటుంది. ప్రతీ అడుగు ఆచితూచి వేయాల్సి ఉంటుంది. మీడియాతో సహా సగటు ప్రేక్షకుడి కళ్లన్నీ వారి మీదనే ఉంటాయి మరి! అందుకే.. లైటేనా పర్వాలేదు గానీ చేసే పని మాత్రం పర్ఫెక్ట్ గా ఉండాలి. మాట్లాడే ప్రతీమాటా.. చేసే చేతా ఒకటికి రెండు సార్లు చూసుకున్న తర్వాతే జనాల్లోకి వెళ్లేలా చూసుకోవాలి. లేదంటే జనాలకు దొరికిపోతారు.. అభాసుపాలైపోతారు.

ఇప్పుడు బాలీవుడ్ బ్యూటీస్ శిల్పాశెట్టి తాప్సీ ఇలాగే బుక్కైపోయారు. జనవరి 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు చెప్పారీ నటీమణులు. గ్రీటింగ్స్ చెప్పడం వరకూ బాగానే ఉందిగానీ.. వారు చెప్పిన లెక్కల్లో బొక్కలున్నాయి. వాటిని పట్టుకున్న నెటిజన్లు.. తెగ వాయించేస్తున్నారు.

నిజానికి నిన్న సెలబ్రేట్ చేసుకున్న రిపబ్లిక్ డే 72వది. అయితే.. తాప్సీ 71వ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు అనిపోస్ట్ చేసింది. దీంతో.. నువ్వింకా 2020లోనే ఉన్నావా? అంటూ ఎద్దేవా చేస్తున్నారు నెటిజన్లు. ఇక శిల్పా శెట్టి విషయం చూస్తే.. ఆమె 72వ.. అంటూ నెంబర్ సరిగానే మెన్షన్ చేసినప్పటికీ.. గణతంత్రం కాకుండా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు చెప్పారు. ఇంకేముందీ..? గణతంత్రానికి స్వాతంత్రానికి కూడా తేడా తెలియదా? అంటూ సెటైర్లు వేస్తున్నారు.

జరిగిన పొరపాటును గుర్తించిన నటీమణులు పోస్టును డెలీట్ చేసి.. ఫ్రెష్ గా శుభాకాంక్షలు చెబుతూ పోస్ట్ చేశారు. కానీ.. అప్పటికే పాత పోస్టులను స్క్రీన్ సాట్ తీసిన చాలా మంది.. వాటిని షేర్ చేస్తూ సెటైర్లు వేస్తున్నారు.
× RELATED అల్ట్రా స్లిమ్ లుక్ తో జివ్వనిపిస్తున్న అనూ
×