సైకో కిల్లర్ జీవితంలో సినిమాటిక్ సీన్లు!

ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 18 హత్యలు చేసిన ఒక సైకో కిల్లర్  ఉదంతం పెను సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. తాజాగా రెండు హత్యలు చేయటం.. చిన్న చిట్టి ఆధారంగా దొరికిన ఈ సీరియల్ సైకో కిల్లర్ కు సంబంధించిన షాకింగ్ నిజాలు వెల్లడయ్యాయి. ఒంటరిగా ఉన్న మహిళల్ని చూస్తే చాలు.. అతడిలోని దుర్మార్గపు బుద్ది బయటకు వచ్చి.. నమ్మించి ప్రాణాలు తీసే వైనం బయటకు వచ్చింది.

అయితే.. అతడి ప్రవర్తనలో మార్పునకు అతడి గతం కూడా కారణమంటున్నారు. ఇటీవల ఘట్ కేసర్.. ములుగు పోలీస్ స్టేషన్ల పరిధిలో ఇద్దరిని చంపిన సైకో కిల్లర్ ను వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్సు పోలీసులు పట్టుకున్నారు. ఇతడి దారుణాల వెనుక అతని గతం ఉందని చెబుతున్నారు. మొదటి భార్య వివాహమైన రెండు వారాలకే మరొకరితో వెళ్లిపోవటం.. మూడేళ్లు కాపురం చేసిన రెండో భార్య విభేదాలు రావటంతో ఇద్దరు పిల్లల్ని తీసుకొని వెళ్లిపోయింది. సహజీవనం చేసిన మూడో మహిళ మరొకరితో సన్నిహితంగా ఉంటూ కంటపడింది. ఇలా.. తనకు ఎదురవుతున్న చేదు అనుభవాలతో 2003లో తుప్రాన్ పోలీస్ స్టేషన్ పరిధిలో మూడో ఆమెను హత్య చేశారు.

అప్పటి నుంచి భర్తలు ఉండి పెడదారిలో వెళుతున్న మహిళల్ని ఎంపిక చేసుకుంటున్న రాములు.. ఇప్పటివరకు పద్దెనిమిది మంది వరకు హత్య చేసినట్లుగా పోలీసులు చెబుతున్నారు. సంగారెడ్డి జిల్లా ఆరుట్ల గ్రామానికి చెందిన రాములుకు తలారీ.. సాయిలు అనే పేర్లు ఉన్నాయి. స్టోన్ కటర్ చేసే ఇతడు.. ప్రస్తుతం బోరబండలో ఉంటున్నాడు. ముగ్గురు మహిళలతో చేదు అనుభవాల అనంతరం సైకో కిల్లర్ గా మారిన అతను.. ఇటీవల మరో మహిళను పెళ్లి చేసుకొని ఆమెతో కలిసి బోరబండలో ఉంటున్నాడు.

భర్తలు ఉండి వారిని మోసం చేస్తూ వ్యభిచారం చేస్తున్న వారిని.. డబ్బు కోసం పరాయి మగవాడికి లొంగిపోయిన వారిని ఎంచుకొని చంపుతాడు. ప్రధానంగా కల్లు కాంపౌండ్ల దగ్గర ఈ తరమా మహిళలతో పరిచయం పెంచుకుంటాడు. వారితో కలిసి కల్లు తాగుతాడు. ఆ పై డబ్బు ఆశ చూపి.. తన వెంట నిర్మానుష్య ప్రాంతాలకు తీసుకెళ్లి.. అక్కడకు వెళ్లిన తర్వాత వారి వివరాలు అడుగుతాడు. వారిలో ఎవరికైనా భర్తలు ఉన్టన్లు తేలితే.. సైకోగా మారిపోయి అత్యాచారం చేస్తాడు. ఆపై చీరతో ఉరి బిగించి లేదంటే బండరాయితో మోది చంపేస్తాడు. డెడ్ బాడీని గుర్తు పట్టలేని రీతిలో  పెట్రోల్ పోసి కాల్చేస్తాడు. ఏ ఆధారం దొరక్కుండా అక్కడ నుంచి జారుకుంటాడు.

అయితే.. ఇతన్ని 2009లో తొలిసారి పోలీసులు పట్టుకున్నారు. అప్పట్లో నార్సింగిలో జరిగిన హత్య కేసులో జీవతఖైదు పడింది. మరో కేసులోనూ అలాంటి శిక్షే పడింది. చర్లపల్లిలో కొంతకాలం శిక్ష అనుభవించాడు. అక్కడ నుంచి తప్పించుకునే అవకాశం లేకపోవటంతో పిచ్చి పట్టినట్లు నటించాడు. జైలు అధికారులు ఎర్రగడ్డలో చేర్చారు. అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు. కొంతకాలం తప్పించుకున్న అతడు.. మళ్లీ సైకోలా మారి ఇద్దరు మహిళల్ని చంపేశాడు. 2013లో అతడ్ని మరోసారి అరెస్టు చేశారు. జీవితఖైదు పడిన కేసుల్ని హైకోర్టులో సవాల్ చేసి.. మిగిలిన కేసుల్లో బెయిల్ పొంది బయటకు వచ్చి మళ్లీ హత్యలు చేశాడు. గత ఏడాది జైలు నుంచి విడుదలైన అతడు.. తాజాగా యూసఫ్ గూడ కల్లు కాంపౌండ్ నుంచి వెంకటమ్మను ఘట్ కేసర్ వద్దకు తీసుకెళ్లి హత్య చేశాడు. 
× RELATED ఆ ఐటీ కంపెనీలో కొలువుల వరద .. త్వరలో 30 వేల జాబ్స్ భర్తీ !
×