'ఆర్.ఆర్.ఆర్' రిలీజ్ డేట్ పై 'వకీల్ సాబ్' ప్రొడ్యూసర్ అప్సెట్..!

టాలీవుడ్ స్టార్ హీరోలు ఎన్టీఆర్ - రామ్ చరణ్ లతో దర్సకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తోన్న భారీ మల్టీస్టారర్ ''ఆర్.ఆర్.ఆర్'' రిలీజ్ డేట్ ని ప్రకటించిన సంగతి తెలిసిందే. దసరా కానుకగా అక్టోబర్ 13న ప్రపంచ వ్యాప్తంగా అన్ని ప్రధాన భాషల్లో రాబోతున్నట్లు జక్కన్న అధికారికంగా వెల్లడించారు. అయితే ఇప్పుడు రాజమౌళి అండ్ టీమ్ తీసుకున్న ఈ నిర్ణయంపై ప్రముఖ బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ అప్సెట్ అయినట్లు తెలుస్తోంది. వివరాల్లోకి వెళ్తే 'వకీల్ సాబ్' సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెడుతున్న బోనీ కపూర్.. హిందీలో 'మైదాన్' అనే సినిమా రూపొందిస్తున్నారు. లెజండరీ ఫుట్ బాల్ ఆటగాడు సయ్యద్ అబ్దుల్ రహిత్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అజయ్ దేవగన్ - ప్రియమణి ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాను అక్టోబర్ 15న రిలీజ్ అవ్వబోతున్నట్లు ఎప్పుడో ప్రకటించారు. అయితే ఇప్పుడు అదే సమయానికి 'ఆర్.ఆర్.ఆర్' వస్తే ఆ ఎఫెక్ట్ 'మైదాన్'పై పడే అవకాశం ఉండటంతో బోనీ కపూర్ అయోసెట్6అయ్యాడని తెలుస్తోంది.

ఈ విషయంపై ఓ న్యూస్ ఛానెల్ తో మాట్లాడుతూ.. ''తప్పకుండా నేను నిరాశ చెందుతున్నాను. ఇది సరైనది కాదు. మైదాన్ విడుదల తేదీని నేను ఆరు నెలల క్రితమే ప్రకటించాను. సినీ పరిశ్రమను కాపాడటానికి మనమందరం కలిసి రావాల్సిన సమయంలో అతను(రాజమౌళి) ఇలా చేశాడు'' అని అన్నట్లు తెలుస్తోంది. 'బాహుబలి'తో మంచి గుర్తింపు తెచ్చుకున్న రాజమౌళికి హాలిడే లో సినిమా రిలీజ్ చేయాల్సిన అవసరం ఉందా? అని ప్రశ్నించాడు. అజయ్ దేవగన్ ఈ విషయంపై రాజమౌళిని సంప్రదించగా అది నా చేతుల్లో లేదని.. రిలీజ్ డేట్ ప్రొడ్యూసర్ అండ్ డిస్ట్రిబ్యూటర్ నిర్ణయమని సమాధానం చెప్పాడని బోనీ కపూర్ చెప్పాడట. అంతేకాకుండా 'ఆర్.ఆర్.ఆర్' అనౌన్స్ మెంట్ విషయం ముందు రోజు వరకూ అజయ్ కి కూడా తెలియదని.. అందుకే అతను సోషల్ మీడియాలో షేర్ చేయలేదని బోనీ కపూర్ చెప్పినట్టు వార్తలు వస్తున్నాయి.
× RELATED అల్ట్రా స్లిమ్ లుక్ తో జివ్వనిపిస్తున్న అనూ
×