ఫౌజీ గేమ్ వచ్చేసింది.. పబ్ జీ లోటును తీరుస్తుందా? ఫీచర్లు ఏమిటి?

కేంద్రప్రభుత్వం చైనా మొబైల్ యాప్స్‌ను నిషేధించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా యువతను ఎంతో ఆకుట్టుకున్న పబ్జీ గేమ్ కూడా పోయింది. అయితే ఈ గేమ్ మీద గతంలో ఎన్నో విమర్శలు ఉన్నాయి. అయితే పబ్జీ పోయాక చాలా మంది నిరాశకు లోనయ్యారు. పబ్జీ లాంటి గేమ్ ఆన్లైన్లో మరొకటి ఉండకపోవడంతో ఈ గేమ్ మళ్లీ ఎప్పుడు వస్తుందా? అని ఆశగా ఎదురుచూస్తున్నారు. అయితే  ఈ నేపథ్యంలో బెంగళూరుకు చెందిన ఎన్కోర్ గేమ్స్ ఓ ప్రకటన చేసింది. పబ్జీని పోలిఉన్న గేమ్‌ను తాము త్వరలో అందుబాటులోకి తెస్తామని ఎన్కోర్స్ ప్రకటించింది. అయితే ఎట్టకేలకు ఎన్కోర్ గేమ్స్ ఫౌజీ గేమ్‌ను తీసుకొచ్చింది. అయితే ఈ గేమ్ ఎలా ఉండబోతున్నది. పబ్జీ ఉన్న ఫీచర్లు అన్నీ ఇందులో ఉన్నాయా? అన్న విషయాలు తెలుసుకుందాం..

ఫౌజీ గేమ్‌ను ఇండియన్ పబ్జీగా పిలుస్తున్నారు. బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ నేతృత్వంలో ఈ గేమ్ రూపొందింది. జనవరి 26న గణతంత్ర దినోత్సవ కానుకగా ఈ గేమ్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఫ్రీ రిజిస్ట్రేషన్ చేసుకున్న వినియోగదారులకు  ఈ గేమ్ ప్రస్తుతం అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం వాళ్లలో మొబైల్స్‌లో గేమ్ ఆటోమెటిక్‌గా డౌన్లోడ్ అయ్యింది.

 ఈ ఫౌజీ గేమ్ 500 ఎంబీ సైజ్‌తో ఉన్నట్టు సమాచారం. గేమ్ స్టార్ట్ చేయగానే మొదటి దశలో మూడు మోడ్స్ అందుబాటులోకి వచ్చాయి.
క్యాంపెయిన్ టీమ్ డెత్ మ్యాచ్ ఫ్రీ ఫర్ ఆల్ అనే మూడు మోడ్స్ కనిపిస్తున్నాయి. క్యాంపెయిన్ మోడ్ మాత్రమే ఇప్పుడు అందుబాటులో ఉంది. అయితే ఈ గేమ్ పబ్జీ గేమ్ లో లాగా మల్టీ ప్లేయర్ కి సపోర్ట్ చేయకపోయిన తర్వాత దశలో మల్టీ ప్లేయర్ సపోర్ట్ తీసుకురానున్నట్లు సంస్థ పేర్కొంది. ఈ గేమ్ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌తో నడుస్తున్నట్టు సమాచారం.  అయితే పబ్జీ లాగా ఈ గేమ్‌లో గన్స్ అందుబాటులో లేవు. కేవలం కత్తులే ఉన్నాయి. అవి కూడా కొన్ని స్టేజెస్ దాటాకా వస్తున్నాయి.

గేమ్ ఎలా ఉందంటే.. సైన్యంలో ఒక సిక్కు సైన్య అధికారి ఉంటాడు. అతడు తోటి సిబ్బందిని చైనా సైన్యం నుంచి రక్షించుకోవాలి.  అయితే ఈ గేమ్‌లో పబ్జీ మాదిరిగా కూల్‌డ్రింక్స్ లేవు. కేవలం భోగి మంటలు మాత్రమే ఉంటాయి. భోగి మంటల్లో చలి కాచుకుంటే మీకు శక్తి వస్తుంది. అంతేకాక తుపాకులు ఉండవు. కేవలం కత్తులు మాత్రమే ఉంటాయి. ఆ కత్తులతో ఇద్దరిని మాత్రమే హత్య చేసే అవకాశం ఉంది. అయితే తర్వాత మోడ్‌లో తుపాకులు యాడ్ చేస్తారేమో వేచి చూడాలి. అయితే పబ్జీ పోటీగా తీసుకొస్తున్నాం.. అని భారీగా ప్రచారం జరిగింది. కానీ ఈ గేమ్ పట్ల నెటిజన్లు కొంత నిరాసక్తత కనబరుస్తున్నారు.
× RELATED ఆ ఐటీ కంపెనీలో కొలువుల వరద .. త్వరలో 30 వేల జాబ్స్ భర్తీ !
×