'సన్ ఆఫ్ ఇండియా' ఫస్ట్ లుక్ డేట్ ఖరారు!

కలెక్షన్ కింగ్ మోహన్ బాబు చాలకాలం తర్వాత కథానాయకుడిగా నటిస్తున్న భారీ మూవీ ‘సన్ ఆఫ్ ఇండియా’. డైలాగ్ రైటర్ డైమండ్ రత్నబాబు దర్శకత్వంలో తెరకెక్కుతుంది. దేశభక్తి నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాను మోహన్ బాబు సొంతబ్యానర్ లక్ష్మీప్రసన్న ఫిలిమ్స్ 24ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. అయితే ఇన్నేళ్ల తర్వాత మోహన్ బాబు ప్రధాన పాత్రలో పవర్ ఫుల్ మూవీ సిద్ధం అవుతున్నట్లు తెలుస్తుంది. తన కెరీర్ లో ఇంతవరకు పోషించని డిఫరెంట్ పాత్రలో మోహన్ బాబు కనిపించ బోతున్నాడట. అలాగే ఇంతవరకు దేశభక్తి నేపథ్యంలో ఇలాంటి కథ కానీ సినిమా గాని తెలుగులో రాలేదని సినీబృందం చెప్పుకొచ్చింది. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న సన్ ఆఫ్ ఇండియా.. ఇటీవలే రెండో షెడ్యూల్ షూట్ హైదరాబాద్లో ప్రారంభించారు.

అయితే ఈ సినిమాను దేశవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల చేయాలనీ ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. ఇక తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. అదేంటంటే.. 'సన్ ఆఫ్ ఇండియా' నుండి కొత్త అప్డేట్ వచ్చేసింది. ఈ సినిమా ఫస్ట్ లుక్ త్వరలో అంటే.. జనవరి 29న ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు దర్శకనిర్మాతలు. అయితే ఈ సినిమాకు సంగీతం మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజా అందిస్తుండటం విశేషం. గతంలో మోహన్ బాబు హీరోగా నటించిన చాలా సినిమాలకు ఇళయరాజా సంగీతం అందించడం జరిగింది. కానీ మళ్లీ ఇన్నేళ్ల తర్వాత వీరిద్దరి కలయికలో సినిమా వస్తుండటంతో సినీప్రేక్షకులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. చూడాలి మరి సన్ ఆఫ్ ఇండియా ఫస్ట్ లుక్ ఎలా ఉండబోతుందో..!!

× RELATED అల్ట్రా స్లిమ్ లుక్ తో జివ్వనిపిస్తున్న అనూ
×