'క్రాక్' హిట్ తో ట్రాక్ లోకి వచ్చిన మాస్ మహారాజా..!

మాస్ మహరాజా రవితేజ 'క్రాక్' సినిమాతో మళ్ళీ ట్రాక్ లోకి వచ్చాడు. సంక్రాంతి సీజన్ లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్ళు రాబట్టింది. వరుస ప్లాప్స్ లో ఉన్న రవితేజకి నూతనోత్సాహం ఇచ్చింది. దీంతో ఇప్పుడు ఆయన నటిస్తున్న తదుపరి సినిమాలకు రెమ్యూనరేషన్ కూడా మళ్ళీ ఒకప్పటిలాగే తీసుకుంటున్నాడని సినీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. ప్రస్తుతం 'ఖిలాడి' సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. 'రాక్షసుడు' ఫేమ్ రమేష్ వర్మ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. పెన్ స్టూడియోస్ అధినేత జయంతి లాల్ గడ సమర్పణలో హవీష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై సత్యనారాయణ కోనేరు ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు

'రాజా ది గ్రేట్' సినిమా తర్వాత వరుస పరాజయాలు పలకరించడంతో రవితేజ 'ఖిలాడి' చిత్రం కోసం పారితోషికం తగ్గించుకున్నాడట. కాకపోతే 'క్రాక్' హిట్ అయితే 14 కోట్లు.. ఫ్లాప్ అయితే 10 కోట్లు అనే విధంగా అగ్రిమెంట్ చేసుకున్నాడట. ఇప్పుడు 'క్రాక్' సినిమా బ్లాక్ బస్టర్ అవడంతో 'ఖిలాడి' మేకర్స్ సినిమా బడ్జెట్ ని పెంచేసారని టాక్ నడుస్తోంది. ఏదేమైనా 'క్రాక్' సినిమా మాస్ మహారాజ్ ఫేమ్ ని రెండింతలు పెంచిందని చెప్పవచ్చు. ఇకపోతే 'క్రాక్' కోసం నిర్మాత దగ్గర తక్కువ రెమ్యూనరేషన్ తీసుకున్న రవితేజ.. రెండు మెయిన్ ఏరియాల రైట్స్ తీసుకున్నాడని.. మొత్తం మీద 10 కోట్ల పైనే అందిందని ఫిలిం సర్కిల్స్ లో చెప్పుకుంటున్నారు.

× RELATED అల్ట్రా స్లిమ్ లుక్ తో జివ్వనిపిస్తున్న అనూ
×