విక్రమ్ కుమార్ 'మనం' వంటి మరో మల్టీస్టారర్ ప్లాన్ చేస్తున్నాడా..?

అక్కినేని మూడు తరాల హీరోలు కలిసి 'మనం' అనే మెమరబుల్ సినిమా చేసిన సంగతి తెలిసిందే. అక్కినేని నాగేశ్వరరావు చివరి చిత్రంగా వచ్చిన 'మనం'లో నాగార్జున - నాగచైతన్య - సమంత కలిసి నటించారు. అఖిల్ - అమల స్పెషల్ అప్పీరియన్స్ ఇచ్చారు. విక్రమ్ కె.కుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ ఫ్యామిలీ మల్టీస్టారర్ ఓ క్లాసిక్ గా నిలిచిపోయింది. అయితే ఇప్పుడు నాగ్ - చైతూ - అఖిల్ - సమంత - అమల - సుమంత్ - సుశాంత్ - సుప్రియ.. ఇలా అక్కినేని ఫ్యామిలీ నటీనటుల భాగస్వామ్యంలో ఓ భారీ మల్టీస్టారర్ కి ప్లాన్స్ జరుగుతున్నాయని ఫిలిం సర్కిల్స్ లో టాక్ వినిపిస్తోంది. అది కూడా విక్రమ్ కుమార్ డైరెక్షన్ లోనే అని అంటున్నారు.

తాజాగా విక్రమ్ కుమార్ కి అక్కినేని కాంపౌండ్ నుంచి పిలుపు వచ్చిందట. అక్కినేని హీరోలందరితో ఓ ఫ్యామిలీ సినిమా తీయాలని.. దానికి తగ్గట్టుగా ఓ కథ ఆల్రేడీ రెడీగా ఉందని.. దాన్ని డెవలెప్ చేసి సినిమాగా తీయాలని విక్రమ్ కి నాగ్ అండ్ టీమ్ చెప్పినట్లుగా సినీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. ఆ స్టోరీని దర్శకుడు దశరధ్ రెడీ చేశాడట. ఇదో ముగ్గురు అన్నదమ్ముల కథ అని.. అందులో సుశాంత్ - సమంత్ - సుప్రియ కూడా ఉంటారని చెప్పుకుంటున్నారు. ఇందులో నిజమెంతో తెలియాలంటే ఇంకొన్నాళ్ళు ఆగాల్సిందే. గతంలో దశరథ్ దర్శకత్వంలో నాగార్జున 'సంతోషం' 'గ్రీకు వీరుడు' వంటి చిత్రాల్లో నటించాడు. మరోవైపు విక్రమ్ కుమార్ నాగ చైతన్యతో 'థ్యాంక్యూ' సినిమా చేస్తున్నాడు.
× RELATED అల్ట్రా స్లిమ్ లుక్ తో జివ్వనిపిస్తున్న అనూ
×