ఓటీటీ బాటలో నరేష్.. విజయానికి ‘నాంది’ పలుకుతాడా?

‘అల్లరి నరేష్..’ అంటే బాక్సాఫీస్ వద్ద మినిమం గ్యారెంటీ హీరో. ‘వస్తే లాభాలు.. లేదంటే మన రిటర్న్స్ మనకు వచ్చేస్తాయి’ అంటూ నిర్మాతలు ధైర్యంగా సినిమాలు రూపొందించేవారు. కానీ.. కొంతకాలంగా మనోడి అల్లరిని ఆడియన్స్ ఎంజాయ్ చేయలేకపోతున్నారు. ఫలితంగా ఫెయిల్యూర్సే ఎదురవుతున్నాయి. అప్పుడెప్పుడో వచ్చిన సుడిగాడు సినిమా తప్ప.. చెప్పుకోదగిన విజయం కనిపించట్లేదు. అయినప్పటికీ.. తిరిగి సక్సెస్ ట్రాక్ ఎక్కేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాడు.

తక్కువ సమయంలోనే 50 సినిమాలు చేశాడు నరేష్. మనోడి సుడి నడిచిన టైంలో వరస విజయాలతో బాక్సాఫీస్ దుమ్ము దులిపేశాడు కూడా. కానీ.. దాదాపు ఎనిమిదేళ్లుగా అపజయాలే పలకరిస్తున్నాయి. తాజాగా రిలీజ్ అయిన ‘బంగారు బుల్లోడు’ సినిమా డబుల్ డిజాస్టర్ గా నిలిచింది. దీంతో.. రాబోయే మూవీ ‘నాంది’పైనే ఆశలన్నీ పెట్టుకున్నాడు నరేష్. విజయ్ కనకమేడల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ త్వరలో ఓటీటీలో రిలీజ్ కాబోతోంది!

ఈ సినిమాలో అల్లరి నరేష్ కాస్తా.. సీరియస్ నరేష్ కనిపించబోతున్నాడు. దర్శకుడు సతీష్ వేగేశ్న నిర్మించిన ఈ మూవీ.. జైలు బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కింది. ఇప్పటికే.. విడుదలైన 'నాంది' ఫస్ట్ లుక్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఆ తర్వాత రిలీజ్ చేసిన టీజర్ కూడా అలరించింది. ఈ మూవీ పోస్టర్లో నరేష్ నగ్నంగా పోలీస్ స్టేషన్లో కూర్చుని ఉన్నాడు. దీంతో.. కామెడీ హీరో నుంచి రాబోతున్న ఈ థ్రిల్లర్ ఎలా ఉంటుందోననే ఆసక్తి పెరిగింది ప్రేక్షకుల్లో.

అందుతున్న అప్డేట్ ప్రకారం.. ఈ చిత్రం యొక్క ఫుల్ రైట్స్ ను జీ స్టూడియోస్ కొనేసింది. ‘నాంది’ మూవీ థియేట్రికల్ శాటిలైట్ రైట్స్ తోపాటు డిజిటల్ హక్కులను కూడా జీ సంస్థ సొంతం చేసుకుంది. రూ .8.5 కోట్లకు డీల్ పూర్తయిందని సమాచారం. ఇక రిలీజ్ డేట్ ప్రకటించడం మాత్రమే మిగిలి ఉందని సమాచారం. ఈ చిత్రానికి శ్రీచరన్ పకాల సంగీతం అందించారు.
× RELATED అల్ట్రా స్లిమ్ లుక్ తో జివ్వనిపిస్తున్న అనూ
×