కేజీఎఫ్-2 నైజాం రైట్స్.. దిమ్మతిరుగుతోంది బ్రో..!

దేశవ్యాప్తంగా సినీ ప్రేమికులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మూవీ కేజీఎఫ్-2. ఆ ఎదురు చూపుల్లో ఎంత కోరిక ఉందో.. లేటెస్ట్ గా రిలీజైన ట్రైలర్ క్లియర్ చేసింది. జనవరి 8వ తేదీన రిలీజైన్ ‘కేజీఎఫ్ చాప్టర్-2’ సృష్టించిన సునామీ అంతా ఇంతా కాదు. రిలీజ్ అయిన గంటల్లోనే కోట్ల వ్యూస్ సాధించింది నెవ్వర్ బిఫోర్ రికార్డులను నెలకొల్పిందీ టీజర్. సోషల్ మీడియాలో ప్రకంపనలు పుట్టించింది. ఫాస్టెస్ట్ వ్యూస్ లైక్స్ సాధించిన తొలి చిత్రంగా ప్రపంచ రికార్డు నమోదు చేసింది!

కేజీఎఫ్ చాప్టర్-1 థియేటర్లు దద్దరిల్లే రిజల్ట్ ను ప్రకటించడంతో.. సెకండ్ పార్ట్ కోసం ప్రపంచం మొత్తం వెయిట్ చేస్తోంది. వారి అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా యశ్ పుట్టిన రోజు సందర్భంగా టీజర్ రిలీజ్ చేశారు. ఈ టీజర్ రిలీజైన 12 గంటల్లోనే వివిధ భాషల్లో కలిపి 25 మిలియన్ల వ్యూస్ మార్కును క్రాస్ చేయడం విశేషం. ఇక అత్యంత వేగంగా 1 మిలియన్ లైక్స్ 2 మిలియన్ లైక్స్ సంపాదించిన ప్రపంచ తొలి టీజర్గా నిలిచింది.

అయితే.. ఈ భారీ బడ్జెట్ యాక్షన్ డ్రామా హక్కులు పొందడానికి చాలా మంది ఎదురు చూస్తున్నారు. దీంతో ఈ మూవీ బిజినెస్ కూడా కళ్లు చెదిరేలా సాగుతోంది. పలువురు డిస్ట్రిబ్యూటర్స్ భారీ మొత్తాలతో మేకర్స్ ఎదుట క్యూ కడుతున్నట్టు సమాచారం.

కాగా.. ఏ చిత్రానికైనా నైజాం రైట్స్ కోసం పంపిణీదారులు పోటీపడుతుంటారు. ఇక భారీ చిత్రాల హక్కులు దక్కించుకునేందుకు శక్తివంచన లేకుండా చేస్తారు. నైజాం ఏరియాలో కలెక్షన్లు కూడా అలాగే ఉంటాయి. అందుకే.. ఇక్కడ పోటీ ఎక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలో.. కేజీఎఫ్-2 నైజాం థియేట్రికల్ హక్కులకు మేకర్స్ భారీ రేట్ ఫిక్స్ చేశారట. 75 కోట్ల రూపాయలుగా నిర్ణయించినట్టు సమాచారం.

ఈ చిత్రం నైజాం రైట్స్ పొందేందుకు ప్రముఖ టాలీవుడ్ నిర్మాత కమ్ డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజుతోపాటు పలువురు పోటీలో ఉన్నారట. ఎవరు దక్కించుకోబోతున్నారు? ఎంతకు తీసుకోబోతున్నారు? అనే విషయాలు త్వరలోనే తెలియనున్నాయి. ఈ సమ్మర్ లో చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు మేకర్స్.
× RELATED అల్ట్రా స్లిమ్ లుక్ తో జివ్వనిపిస్తున్న అనూ
×