#రకుల్.. ఈ బ్యాలెన్స్ సరే.. లైఫ్ లో ఆ బ్యాలెన్స్ ఎపుడు?

ఇటీవలే కోవిడ్ కి చికిత్స పొంది తిరిగి కోలుకుంది రకుల్. ఆ తర్వాత వెంట వెంటనే షూటింగులతో బిజీ అయిపోయింది. క్రిష్ దర్శకత్వంలో కొండ పొలం చిత్రీకరణ పూర్తి చేసి.. ఆ తరవాత హిందీ తమిళ కమిట్ మెంట్లపైనా ఈ అమ్మడు దృష్టి సారించింది.

రకుల్ ప్రస్తుతం బాలీవుడ్ లో వరుస సినిమాలతో బిజీ. అజయ్ దేవ్ గన్.. సిద్ధార్థ్ మల్హోత్రా కలిసి నటిస్తున్న `థాంక్స్ గాడ్` చిత్రీకరణలో పాల్గొంటోంది. ఈ చిత్రం లైఫ్ కామెడీ స్లైస్ అంటూ వేడెక్కించేస్తోంది టీమ్. దేవగన్ దర్శకత్వంలో మేడే అనే చిత్రంలోనూ నటిస్తోంది. అర్జున్ కపూర్ సరసన ఓ చిత్రంలో నటిస్తోంది.

అయితే ఇంతటి బిజీ షెడ్యూల్స్ ని రకుల్ ఎలా మ్యానేజ్ చేస్తోంది? అన్న ప్రశ్నకు ఏకైక సమాధానం..యోగా మెడిటేషన్ అనే చెప్పాలి. ఇందులో పట్టభద్రురాలైంది. నిరంతరం రకుల్ యోగ సాధనకు సంబంధించిన పోస్టులు అంతర్జాలంలో వేడెక్కిస్తున్నాయి. ``బ్యాలెన్స్ అనేది నీకు నువ్వు కనుగొనేది కాదు.. నీకు నువ్వు క్రియేట్ చేసేది`` అంటూ బ్యాలెన్స్ యోగాసనానికి సంబంధించిన క్లాస్ తీస్కుంది. అంతేకాదు ఎంతో బ్యాలెన్సింగ్ గా ఆ అసనం వేసి చూపించింది. ప్రస్తుతం ఈ ఫోటో అంతర్జాలంలో వైరల్ గా మారింది. కేవలం బ్యాలెన్స్ అనేది యోగాకి సంబంధించినదే కాదు.. లైఫ్ కి సంబంధించినది కూడా. చాలామంది అది బ్యాలెన్స్ చేయలేక చతికిలబడుతుంటారు. కొందరు ఆచరణలో సాధ్యం చేసి చూపిస్తారు.
× RELATED ఐదు తెలుగు సినిమాలకు సైన్ చేసినట్లు వెల్లడించిన 'హార్ట్ ఎటాక్' బ్యూటీ..!
×