'హ్యాండ్ పెయింటెడ్ డ్రెస్'తో కవర్ పేజీపై మెరిసిన క్రాక్ హీరోయిన్..

కెరీర్ ప్రారంభం నుండి తన గ్లామర్ షోతో ఆకట్టుకుంటుంది చెన్నైభామ శృతిహాసన్. సీనియర్ స్టార్ హీరో కమల్ హాసన్ కూతురుగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన శృతి.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు దక్కించుకుంటోంది. తన అందాల ఆరబోతతో కుర్రకారు మతులు పోగొడుతున్న శృతి మల్టీ టాలెంటెడ్.. బాలనటిగా అరంగేట్రం చేసిన ఈ భామ నేడు సౌత్ ఇండియన్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఆదరణ పొందుతుంది. అయితే అమ్మడు సినిమాలతోనే కాదు.. మత్త్చెక్కించే మ్యాగజైన్ ఫోటోలతో కూడా అభిమానులను ఎంటర్టైన్ చేస్తోంది. సోషల్ మీడియాలో మిలియన్ల ఫాలోయింగ్ కలిగిన శృతి.. తాజాగా ఇంస్టాగ్రామ్ వేదికగా ఓ మ్యాగజైన్ పిక్ పోస్ట్ చేసింది. గ్లోబల్ గ్రేజియా బ్యూటీ 2021 కవర్ పేజీపై ధగధగ మెరిసిపోతుంది. హ్యాండ్ మెయిడ్ పెయింటెడ్ బాడీ సూట్ ధరించి గ్రేజియా ఇండియా మ్యాగజైన్ కి అందం తీసుకొచ్చింది అమ్మడు.

ఆ ఫోటోలో శృతి హెయిర్ స్టైల్ స్టైలిష్ లుక్ అభిమానులను ఫిదా చేస్తున్నాయని చెప్పవచ్చు. అందుకే గ్యాప్ లేకుండా లైక్ షేర్ అంటూ వైరల్ చేసేస్తున్నారు. 'అనగనగా ఓ ధీరుడు' సినిమాతో తెలుగులో అరంగేట్రం చేసిన శృతిహాసన్. తెలుగుతో పాటు తమిళ హిందీ బాషలలో కూడా హీరోయినుగా రాణిస్తుంది. తెలుగులో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చేసిన శృతి తన తొలి సినిమాతోనే 'బెస్ట్ డెబ్యూ యాక్ట్రెస్'గా అవార్డు అందుకుంది. ఇక చివరిగా పవన్ కళ్యాణ్ సరసన కాటమరాయుడు సినిమాలో కన్పించిన ఈ అమ్మడు చాలా గ్యాప్ తర్వాత రవితేజ సరసన 'క్రాక్' సినిమాతో మళ్లీ హిట్ అందుకుంది. ప్రస్తుతం క్రాక్ మూవీ బాక్సాఫీస్ దగ్గర విజయవంతంగా ప్రదర్శితం అవుతోంది. ఇదేగాక అమ్మడు పవర్ స్టార్ సరసన వకీల్ సాబ్ సినిమాలో కూడా నటించింది. ఈ సినిమా కూడా విడుదలకు రెడీగా ఉంది.
× RELATED నాని సినిమా పై ఫిర్యాదు చేసిన నిర్మాత.. ఏమైందంటే??
×