సమంత బ్యాగ్ రేటెంతో తెలుసా.. షాకవ్వాల్సిందే!

మహిళలు అమితంగా ఇష్టపడే ఐటమ్స్ లో ఒకటి హ్యాండ్ బ్యాగ్. టాప్ టూ బాటమ్ ట్రెండీగా డ్రెస్ చేసుకోవడానికి ఎంతగా ఆరాటపడతారో.. అంతే అద్భుతమైన హ్యాండ్ బ్యాగ్ కూడా ఉండాలని కోరుకుంటారు. టాలీవుడ్ సూపర్ స్టార్ సమంతా అక్కినేని కూడా ఇందుకు మినహాయింపు కాదు. ఈ ఫ్యాషన్ ఐకాన్ వద్ద బెస్ట్ హ్యాండ్ బ్యాగ్ కలెక్షన్స్ ఉంది. అందులో కొన్ని బ్యాగుల రేటు చూస్తే దిమ్మతిరగాల్సిందే.

ఫ్లాప్ బ్యాగ్..

సాధారణ మహిళలు కూడా సాధ్యమైనంత మేర కాస్ట్లీ బ్యాగ్స్ వాడుతుంటారు. మరి సినిమా సెలబ్రిటీలు ఇంకెంత ఖరీదైన బ్యాగులు యూజ్ చేస్తారో తెలియనిది కాదు. ఇలాంటి కాస్ట్లీ బ్యాగ్ లో ఒకటి చానెల్ ఫ్లాప్ బ్యాగ్. ఈ బ్యాగ్ తమ వద్ద లేని సెలబ్రిటీ ఉండరంటే అతిశయోక్తి కాదు. సమంతా దగ్గర జంబో అనే బ్లాక్ క్విల్టెడ్ ఫ్లాప్ బ్యాగ్ ఉంది. ఈ బ్యాగ్ ని సమంత బ్లూ జంప్ సూట్ తో మ్యాచ్ చేయడమే ఒక ఫాషన్ సింబల్. అయితే.. ఈ చానెల్ బ్యాగ్ ధర ఎంతో తెలుసా? అక్షరాలా 390150 రూపాయలు!

ఎల్వీ హ్యాండ్ బ్యాగ్..

సామ్ కలెక్షన్లో ఉన్న మరో హ్యాండ్ బ్యాగ్ ఎల్వీ. ఇది కూడా రాయల్ లుక్ తో అదిరిపోతుంది. స్టాటస్ సింబల్ షో చేయాలని భావించే చాలా మంది ఈ హ్యాండ్ బ్యాగును యూజ్ చేస్తుంటారు. ఈ బ్యాగ్ ధర 296960 రూపాయలు.

లూయీ వ్యూటన్ బ్లీకర్ బాక్స్..

సమంతా కి లూయీ వ్యూటన్ బ్యాగ్స్ అంటే మక్కువ చాలా ఎక్కువ. అందుకే ఆమె వద్ద ఈ సూపర్ కూల్ బ్లీకర్ బాక్స్ బ్యాగ్ కూడా ఉంది. ఈ బ్యాగ్ ను తరచూ వినియోగిస్తూ ఉంటుంది. ఈ బ్యాగ్ తో పాటు ఆమె బ్లాక్ పోల్కా డాట్స్ ఉన్న స్లిప్ డ్రెస్ స్కై హై హీల్స్ షాండిలియర్ ఇయర్ రింగ్స్ తో ధరిస్తారు. తద్వారా తనదైన మ్యాచింగ్ ను పరిచయం చేస్తారు. ఈ బ్యాగ్ ధర రూ. 266792

మినీ షాపర్..

అక్కినేని సమంతకు కొన్ని బ్రాండ్స్ అంటే విపరీతమైన ఇష్టం. అందులో లూయీ వ్యూటన్ తో పాటూ ఆమె వార్డ్రోబ్ లో కనిపించే ఇంకొక బ్రాండ్ అలెగ్జాండర్ వ్యాంగ్. ‘థాంక్ యూ’ అని గోల్డ్ కలర్ లో రాసి ఉన్న బ్లాక్ సెక్విన్స్ ఉన్న షాపర్ బ్యాగ్ ఆమె వద్ద ఉంది. ఈ బ్యాగ్ ధర 134182 రూపాయలు.

వ్యాంగ్ క్రాస్ బాడీ బ్యాగ్..

కరోనా వల్ల వేసుకోలేకపోయిన ఔట్ఫిట్స్ వాడలేకపోయిన బ్యాగ్స్ గురించి సమంత ఒక వీడియో చేశారు. అందులో షిమ్మరీ సిల్వర్ సెక్విన్స్ తో ఉన్న అలెగ్జాండర్ వ్యాంగ్ క్రాస్ బాడీ బ్యాగ్ అందరి దృష్టినీ ఆకర్షించింది. ఈ బ్యాగ్ ని సమంతా బ్లాక్ బ్రాలెట్ బాడీకాన్ బ్లాక్ స్కర్ట్ తో మ్యాచ్ చేస్తారు. ఈ బ్యాగ్ ధర 65984 రూపాయలు.

ఈ విధంగా కాస్ట్లీ బ్యాగ్స్ యూజ్ చేస్తూ.. వాటిని తనదైన ఫ్యాషన్ తో మ్యాచ్ చేస్తూ ఉంటుంది సమంత అక్కినేని. సామ్ ట్రెండీ డ్రెస్ సెన్స్ విత్ మ్యాచింగ్ హ్యాండ్ బ్యాగ్ చూసి.. సహచరులు ఎట్రాక్ట్ అవుతుంటే.. ఫ్యాన్స్ ఫిదా అవుతుంటారు.
× RELATED నాని సినిమా పై ఫిర్యాదు చేసిన నిర్మాత.. ఏమైందంటే??
×