ఎయిర్ పోర్టులో 'ఎర్రకలువ'లా ఎదురుపడిన ఢిల్లీ సుందరి!!

సినీ ఇండస్ట్రీకి చెందిన అందమైన భామలు సినిమాలలో కాకుండా బయట ఎక్కడ కనిపించినా కుర్రకారు అసలు ఊరుకోరు. అప్పుడప్పుడు ఎయిర్ పోర్టులలో షాపింగ్ మాల్స్ లలో ఎదురుపడుతుంటారు. ఇటీవల ఎయిర్ పోర్ట్ లో ఎర్రకలువలా కెమెరా కంటపడింది టాలీవుడ్ యంగ్ హీరోయిన్ రాశిఖన్నా. మరి మీడియావాళ్లు ఊరుకుంటారా.. అలా అమ్మడిని క్లిక్ చేసి ఇలా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం రాశిఖన్నా ఫోటోలు నెట్టింట ఫుల్ వైరల్ అవుతున్నాయి. ఇక రాశి గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ఎందుకంటే ఇప్పటికే చాలా సినిమాలు చేసి సుపరిచితం అయిపోయింది. అందుమైన హావభావాలతో పాటు కుర్రకారుకు మతిపోయే అందాల ఆరబోతతో ఆకట్టుకుంటోంది ఈ ఢిల్లీ భామ.

గతేడాది 'వరల్డ్ ఫేమస్ లవర్' సినిమాలో కనిపించిన రాశి.. ప్రస్తుతం తెలుగు సినిమాలకు బ్రేక్ ఇచ్చినట్లు తెలుస్తుంది. అదిగాక అమ్మడు ఇప్పుడు వరుస తమిళ సినిమాలతో ఫుల్ బిజీ అయిపోతుంది. 'ఇమైక నొడిగళ్' సినిమాతో తమిళ ఇండస్ట్రీకి పరిచయం అయింది రాశి. ఆ సినిమా మంచి విజయం సాధించి మంచి క్రేజ్ తెచ్చిపెట్టింది. ఓవైపు సినిమాలు చేస్తూనే.. మరోవైపు సోషల్ మీడియాలో సెగలు రేపుతోంది ఈ అమ్మడు. రాశి చేతిలో ప్రస్తుతం నాలుగు తమిళ సినిమాలు ఉన్నాయి. అరణ్మనై-3 మేధావి తుగ్లక్ దర్బార్ సైతాన్ క బచ్చాలను వరుసగా లైన్ లో పెట్టింది. చూస్తుంటే 2021లో అసలు ఖాళీగా ఉండేలా లేదు. ఇక ఎయిర్ పోర్ట్ రెడ్ కలర్ జర్నీసూట్ లో అమ్మడు వేడివేడి మిర్చిలా మెరిసిపోతుంది. అలాగే మాస్క్ ధరించి కెమెరా వైపు చూస్తూ అందంగా పోజిచ్చింది. మా రాశి కరోనా నిబంధనలను స్ట్రిక్ట్ గా ఫాలో అవుతుందని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
× RELATED నాని సినిమా పై ఫిర్యాదు చేసిన నిర్మాత.. ఏమైందంటే??
×