'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' న్యూ పోస్టర్ విడుదల.. నెట్టింట వైరల్!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో మొదటి సినిమా నుండి ఒక్క సరైన హిట్టును తన ఖాతాలో వేసుకోలేకపోయాడు యంగ్ హీరో అక్కినేని అఖిల్. ఇప్పటికే చేసిన మూడు సినిమాలు అక్కినేని అభిమానులను నిరాశపరిచి బ్లాక్ బస్టర్ రుచిని చూపించలేకపోయాయి. కానీ ఎన్ని ప్లాప్ సినిమాలు పడినా ఈ యువహీరోకి అభిమానుల ఫాలోయింగ్ మాత్రం తగ్గలేదు. అక్కినేని ఫ్యామిలీ హీరోలు కింగ్ నాగార్జున నాగచైతన్యల అభిమానులు ఒక మంచి సినిమాతో వస్తే అఖిల్ సినిమాను ఆదరించడానికి ఇప్పటికి సిద్దంగానే ఉన్నారు. కానీ చేసిన ప్రతి సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొడుతుండటంతో అక్కినేని ఫ్యామిలీ అఖిల్ కెరీర్ గురించి ఆలోచనలో పడ్డారు. అఖిల్.. హలో.. మిస్టర్ మజ్ను సినిమాల తర్వాత చాలా గ్యాప్ తీసుకొని బొమ్మరిల్లు భాస్కర్ కథను ఓకే చేసాడు అఖిల్. కానీ బొమ్మరిల్లు భాస్కర్ కూడా వరుస ప్లాపులలో ఉండటంతో అభిమానులలో అక్కినేని అభిమానులలో ఆందోళన మొదలైంది.

ఇక అఖిల్ భాస్కర్ కాంబినేషన్ సినిమాకు 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' అనే టైటిల్ ఫిక్స్ చేసిన సంగతి తెలిసిందే. నిజానికి గతేడాది ఏప్రిల్ నెలలో విడుదల కావాల్సిన సినిమా.. కరోనా కారణంగా షూటింగ్ నిలిచిపోయి వాయిదా పడింది. ఇక మధ్యమధ్యలో న్యూ లుక్ ఫస్ట్ లుక్ అంటూ పోస్టర్స్ విడుదల చేస్తూ బజ్ క్రియేట్ చేసుకుంటున్నారు మేకర్స్. తాజాగా ఈ సినిమా నుండి సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు చెప్తూ కొత్త పోస్టర్ విడుదల చేశారు. అఖిల్ ఈ పోస్టర్ ను తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసాడు. ఇక కొత్త పోస్టర్ కి సోషల్ మీడియా పరంగా క్రేజ్ బాగానే దక్కుతోంది. ఇక పోస్టర్ లో పూజాహెగ్డే అఖిల్ భుజాల పై చేతులు వేసి చూస్తూ ఉంది. అఖిల్ లేత గడ్డంతో స్మైల్ ఇస్తూ కెమెరా వైపు లుక్కేసాడు. బన్నీవాసు వాసువర్మలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు గోపిసుందర్ సంగీతం అందిస్తున్నాడు. చూడాలి మరి ఈసారైన అఖిల్ హిట్ కొడతాడేమో..!!


× RELATED విక్రమ్ కుమార్ 'మనం' వంటి మరో మల్టీస్టారర్ ప్లాన్ చేస్తున్నాడా..?
×