వర్కౌట్ వీడియో షేర్ చేసిన హాట్ బ్యూటీ..!

బాలీవుడ్ హాట్ బ్యూటీ దిశా పటానీ సోషల్ మీడియాలో ఎంత యాక్టీవ్ గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. డైలీ ఏదొక ఫోటోనో వీడియోనో పోస్ట్ చేస్తూ అభిమానులను ఎంటర్టైన్ చేస్తోంది. యువ హృదయాలను రెచ్చగొట్టే దుస్తుల్లో మెరుపులు మెరిపించే దిశా.. తాజాగా వర్కౌట్స్ కి సంబంధించిన ఓ వీడియోని పోస్ట్ చేసింది. ఇందులో దిశా భారీ వర్కౌట్స్ చేస్తూ కనిపిస్తోంది. దిశా తన ఫాలోవర్స్ కోసం ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన ఈ బ్యాక్ సైడ్ వర్కౌట్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

కాగా పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన 'లోఫర్' సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైంది దిశా. ఆ సినిమా ఆశించిన స్థాయిలో ఆడకపోవడంతో తెలుగులో అవకాశాలు కరువయ్యాయి. దీంతో బాలీవుడ్ సినిమాలపై దృష్టి పెట్టిన ఈ బ్యూటీ.. స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్సులు దక్కించుకుంది. 'ఎంఎస్ ధోని - అన్ టోల్డ్ స్టోరీ' 'కుంఫు యోగా' 'భారత్' 'భాగీ 2' 'మలంగ్' వంటి సినిమాలలో నటించింది. అలానే పలు చిత్రాల్లో ప్రత్యేక గీతాల్లో నర్తించి అలరించింది. ప్రస్తుతం ప్రభుదేవా దర్శకత్వంలో సల్మాన్ ఖాన్ హీరోగా నటిస్తున్న ‘రాధే’ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. అలానే మోహిత్ సూరి రూపొందించే 'ఏక్ విలన్ 2' సినిమాలో దిశా పటాని నటించనుంది.


× RELATED ట్రైలర్ టాక్ - ‘నువ్వుంటే నా జతగా’.. పెళ్లితోనే ప్రేమ మొదలవుతుంది!
×