వర్మ లైఫ్ టైమ్ డ్రీమ్ ప్రాజెక్ట్ దావూద్ ఇబ్రహీం ఫస్ట్ లుక్ వచ్చేస్తోంది..!

సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ మరో సెన్సేషనల్ ప్రాజెక్ట్ ని అనౌన్స్ చేశాడు. మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం నిజ జీవితకథ ఆధారంగా ఒక వెబ్ సిరీస్ ను రూపొందిస్తున్నానని.. ఇది తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని ఆర్జీవీ రెండేళ్ల క్రితమే వెల్లడించాడు. అయితే ఆ తర్వాత దీని గురించి ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు. అందులోనూ వర్మ వేరే ప్రాజెక్ట్స్ చేస్తూ బిజీగా ఉండటంతో అందరూ దాని గురించి మర్చిపోయారు. అయితే తాజాగా మరోసారి తన డ్రీమ్ ప్రాజెక్ట్ ని గుర్తు చేస్తూ కీలక ప్రకటన ఇచ్చాడు వర్మ.

ఆర్జీవీ ట్వీట్ చేస్తూ.. తన లైఫ్ టైమ్ డ్రీమ్ ప్రాజెక్ట్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను జనవరి 15న ఉదయం 11 గంటలకు విడుదల చేస్తున్నామని చెప్పడానికి థ్రిల్లింగ్ గా ఉందని చెప్పుకొచ్చాడు. ఇది దావూడ్ ఇబ్రహీం ప్రపంచంలోనే భయంకరమైన ఆర్గనైజేషన్ గా ఎలా ఎదిగాడో చెప్పే నిజమైన కథ అని వర్మ పేర్కొన్నాడు.  ఈ ప్రాజెక్ట్ ను స్పార్క్ కంపెనీ అధినేత స్పార్క్ సాగర్ నిర్మిస్తున్నట్టు తెలిపాడు. కాగా వర్మ గతంలో దావూద్ ఇబ్రహీం కథ ఆధారంగా 'కంపెనీ' అనే సినిమా తీశాడు. అజయ్ దేవగణ్ - వివేక్ ఒబెరాయ్ - ఊర్మిళ ప్రధాన పాత్రల్లో ఈ సినిమాను రూపొందించారు. అయితే దావూద్ ఇబ్రహీం స్టోరీకి పూర్తి న్యాయం చేయలేదని భావించిన ఆర్జీవీ.. దావూద్ గురించి గత రెండు దశాబ్దాలుగా సమాచారం సేకరించి ఓ వెబ్ సిరీస్ తీస్తానని అప్పట్లో ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.
× RELATED 'నేనేం చెయ్య' అంటూ 'ఎఫ్-సి-యూ-కే
×