సోనూ సూద్ పై సంచలన ఆరోపణ చేసిన ముంబై కార్పొరేషన్

దేశమంతా బాలీవుడ్ నటుడు సోనూ సూద్ సేవానిరతిని వేయినోళ్ల పొగుడుతుంటే అతడు నివాసం ఉండే ముంబైలో మాత్రం దారుణంగా అవమానిస్తున్నారు. తాజాగా ముంబై కార్పొరేషన్.. సోనూసూద్ పై సంచలన ఆరోపణలు చేసింది.

సోనూసూద్ తరచూ చట్టాన్ని ఉల్లంఘిస్తున్నాడని ముంబై మున్సిపల్ కార్పొరేషన్ బాంబే హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేస్తూ ఆరోపించింది. ముంబై శివార్లలోని జుహులో ఓ రెసిడెన్షియల్ భవనానికి కట్టిన అక్రమ నిర్మాణాలను తమ సిబ్బంది ఎన్ని సార్లు కూల్చివేసినా వాటిని చట్ట విరుద్ధంగా మళ్లీ మళ్లీ నిర్మిస్తున్నాడని ముంబై కార్పొరేషన్ పేర్కొంది.

తన ఆస్తికి సంబంధించి ముంబై కార్పొరేషన్ జారీ చేసిన నోటీసును సవాల్ చేస్తూ సోనూ సూద్ కోర్టులో పిటీషన్ వేయగా.. దానిపై కార్పొరేషన్ అఫిడవిట్ సమర్పించింది.

సోనూ సూద్ కట్టిన అనధికార నిర్మాణాలను గతంలో రెండు సార్లు కూల్చివేసినప్పటికీ తిరిగి సూద్ ఇలా పునర్మించాడని అధికారులు తెలిపారు. శక్తి సాగర్ అనే ఆరంతస్తుల బిల్డింగ్ ను కమర్షియల్ హోటల్ గా మారుస్తున్నాడని.. లైసెన్స్ లేకపోయినా నిబంధనలు అతిక్రమించి ఆయన ఇలా చట్ట వ్యతిరేకిగా మారాడని ముంబై కార్పొరేషన్ ఆరోపించింది. రెసిడెన్షియల్ భవనాన్ని హోటల్ గా మార్చడానికి వీల్లేదని కార్పొరేషన్ తెలిపింది. పైగా వేధిస్తున్నారని ఆరోపణలు చేస్తున్నాడని తెలిపింది.

ఈ భవనానికి సోనూసూద్ కానీ.. ఆయన భార్య కానీ సొంత యజమానులమని నిరూపించే డాక్యుమెంట్లు ఏవీ చూపలేదని వెల్లడించింది.× RELATED దుస్తుల పై నుండి స్తనాలు తాకితే తప్పు కాదు... హైకోర్టు తీర్పు పై సుప్రీం కోర్టు స్టే
×