విగ్రహాల ధ్వంసంపై డీజీపీ సంచలన వ్యాఖ్యలు

ఆంధ్రప్రదేశ్ లో ఆలయాలపై వరుస దాడులకు సంబంధించి డీజీపీ గౌతం సవాంగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పటిదాకా దేవాలయాలు విగ్రహాల ధ్వంసంపై 44 కేసులు నమోదు చేశామని డీజీపీ తెలిపారు. ఆయా కేసుల్లో కీలక ఆధారాలను సైతం సేకరించామన్నారు.

కొంతమంది ఆలయాలపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. అలాంటి ఫేక్ న్యూస్ లు కొన్ని సార్లు సమస్యాత్మకంగా మారుతాయన్నారు. పోలీసులు కుల మత రాజకీయాలకు అతీతంగా పనిచేస్తారని చెప్పుకొచ్చారు.

అంతర్వేది ఘటన తర్వాత నుంచి పోలీసులు భిన్నమైన చాలెంజ్ ను ఎదుర్కొన్నారని డీజీపీ గౌతమ్ సవాంగ్ స్పష్టం చేశారు. క్యాంపెయిన్ తరహాలో అల్లర్లు సృష్టించాలని చూశారు. దాన్ని పూర్తిగా కంట్రోల్ చేయడానికి కృషి చేశాం. ఇక ఆ కేసును రాష్ట్ర ప్రభుత్వం సీబీఐకి అప్పగించింది. మున్ముందు ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండాలనే ఉద్దేశంతో రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఆలయాల్లోనూ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను చేస్తున్నాం.

ఇప్పటివరకు 55871 దేవాలయాలకు జియో ట్యాగింగ్ చేయడమే కాకుండా.. 14824 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. ఇంకా ఈ ప్రక్రియ కొనసాగుతోందని తెలిపారు.
× RELATED ఏపీ ప్రభుత్వ ప్రకటనలో.. తెలంగాణ రాష్ట్ర లోగో.. పిక్ వైరల్..!
×