మధు పాటకు కన్నీరు పెట్టుకున్న అనసూయ

బుల్లి తెరపై హాట్ యాంకర్ అనసూయ సందడి మామూలుగా లేదు. ఆమె ప్రతి షో లో కూడా కనిపిస్తూ హంగా చేస్తోంది. ప్రస్తుతం ఈమె జబర్దస్త్ కు సంబంధించిన ఇతర ప్రత్యేక కార్యక్రమాల్లో రెగ్యులర్ గా కనిపిస్తూనే ఉంది. తాజాగా అనసూయ అత్తో అత్తమ్యమ కూతురో సంక్రాంతి స్పెష్ కార్యక్రమంలో పాల్గొంది. అందులో ఆదికి జోడీగా రోజాకు కూతురుగా కనిపించింది. ఈ షో లో అనసూయ చాలా సందడి చేశారు. ఆదితో కలిసి డాన్స్ చేయడతో పాటు ట్రాక్టర్ ను కూడా డ్రైవ్ చేసింది. తాజాగా విడుదల చేసిన ప్రోమోలో మాత్రం అనసూయ కన్నీరు పెట్టుకుంది.

మధు ప్రియ ఆడపిల్లల గురించి పాడిన పాట వింటూ అనసూయ కన్నీరు పెట్టుకుంది. కేవలం అనసూయ మాత్రమే కాకుండా అక్కడ ఉన్న వారు అంతా కూడా కన్నీరు పెట్టుకున్నారు. ఆడపిల్లలను గర్బంలోనే స్కానింగ్ చేయించి తెలుసుకుని కత్తులతో కట్ చేస్తున్నారు అంటూ మధు ప్రియ పాడింది. ఆ పాటలో ఉన్న సాహిత్యం ప్రతి ఒక్కిరికి గుచ్చుకుంది. మధు ప్రియ పాట ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కడుపులో ఉన్న ఆడపిల్లను కత్తులతో అనడంతో కన్నీరు ఆగలేదు అంది. అబార్షన్ లను చేయించవద్దంటూ ఈ పాట ద్వారా మధు ప్రియ మరియు మొత్తం యూనిట్ సభ్యులు జనాలకు విజ్ఞప్తి చేశారు.
× RELATED చైతూని పడేయడం కోసమే జిమ్ లో జాయిన్ అయ్యా: సమంత
×