అప్పట్లో అలా ఉండేదాన్ని: కంగనా రనౌత్

కంగనా రనౌత్..' బాలీవుడ్ క్వీన్ గా వెలుగొందుతున్న ఈ బ్యూటీని.. అంతే స్థాయిలో వివాదాలూ చుట్టుముట్టాయి. ఏ విషయమైనా తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొడుతూ ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకుంది కంగనా. ఇటీవల మహారాష్ట్ర ప్రభుత్వంతో పేచీ పెట్టి పొలిటికల్ గానూ టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యింది. లేటెస్ట్ గా ఓ ట్వీట్ చేసింది ఈ బ్యూటీ. ఇందులో తన చిన్ననాటి ఫొటో షేర్ చేసిన కంగనా.. నాటి తీపి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంది.

  ఇవాళ లోహ్రీ ఫెస్టివల్. పంజాబ్ హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో ఈ పండగ చాలా ఫేమస్. ఈ ఫెస్టివల్ రావడం ద్వారా శీతాకాలం ముగుస్తుందని భావిస్తారు అక్కడి స్థానికులు. ఈ పండుగ సందర్భంగా తన చైల్డ్ హుడ్ ఫొటోను షేర్ చేసి.. అప్పట్లో తాను చేసిన పనులు చెప్పింది కంగనా.

'ఈ పండగ రాగానే పిల్లలంతా గుంపులు ఏర్పడేవాళ్లం. ఫేమస్ లోహ్రీ పాటలు పాడుతూ బంధువుల నుంచి డబ్బులు/స్వీట్లు సేకరించేవాళ్లం' అని చెప్పింది కంగనా.

అంతేకాకుండా.. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ గురించీ మాట్లాడింది బాలీవుడ్ క్వీన్. అప్పట్లో గ్రామాల్లో ఉమ్మడి కుటుంబాలు ఉండేవని ఆ కుటుంబాల పిల్లలు చాలా సంతోషంగా ఉండేవారని తెలిపింది. సిటీల్లోని పిల్లలకన్నా.. గ్రామాల్లోని పిల్లలే ఎక్కువ ఆనందంగా గడిపేవారని రాసుకొచ్చింది కంగనా. ఏదిఏమైనప్పటికీ.. అందరికీ లోహ్రీ పండుగ శుభాకాంక్షలు అంటూ ముగించింది.
× RELATED 'ఆర్.ఆర్.ఆర్' రిలీజ్ డేట్ పై 'వకీల్ సాబ్' ప్రొడ్యూసర్ అప్సెట్..!
×