ఉపేంద్ర కాకుండా మరో స్టార్ 'కబ్జా'

కన్నడ స్టార్ ఉపేంద్ర నటించిన మోస్ట్ వెయిటెడ్ మూవీ 'కబ్జా' మూవీ త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. పాన్ ఇండియ మూవీగా ఈ సినిమాను ఏకంగా ఏడు భాషల్లో విడుదల చేయబోతున్నారు. ఇప్పటికే విడుదల అయిన ఫస్ట్ లుక్ సినిమాపై ఆసక్తిని పెంచింది. ఉపేంద్ర సినిమా అంటే మ్యాటర్ ఉంటుందని సౌత్ ఆడియన్స్ నమ్మకం. ఈసారి సౌత్ లోనే కాకుండా ఉత్తరాదిన కూడా ఈ సినిమా మంచి అంచనాలను కలిగి ఉంది. ఇక ఈ సినిమాకు సంబంధించిన ఒక ఆసక్తికర వార్త ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. కబ్జా సినిమాలో ఉపేంద్ర మాత్రమే కాకుండా మరో స్టార్ కూడా ఉన్నాడట.

మరో స్టార్ విషయాన్ని స్వయంగా చిత్ర యూనిట్ సభ్యులు అధికారికంగా పేర్కొన్నారు. సంక్రాంతి సందర్బంగా రేపు ఆ విషయాన్ని ప్రకటించబోతున్నట్లుగా పోస్టర్ ను విడుదల చేశారు. ఉపేంద్రతో పాటు మరో స్టార్ కూడా కబ్జాలో నటిస్తున్న నేపథ్యంలో ఆ హీరో ఎవరై ఉంటారా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటి వరకు ఆ హీరో ఎవరు అనేది చిన్న క్లూ కూడా లేదు.. లీక్ కూడా ఇవ్వలేదు. అత్యంత జాగ్రత్తగా వ్యవహరిస్తూ వచ్చిన యూనిట్ సభ్యులు రేపు రివీల్ చేయబోతున్నారు. రేపు ఉదయం 10  గంటలకు కబ్జా చేయబోతున్న మరో హీరో ఎవరు అనేది తేలిపోనుంది.
× RELATED ఆచార్యకు 'జిగేల్ రాణి' భారీ డిమాండ్స్.. ఏంటంటే??
×