విరాఠపర్వం లవ్వు.. అడవిలో జంట కుహూగానం

ఈ ప్రేమ జంట కుహూగానం గమ్మత్తుగా ఉంది. అడవిలో పచ్చందాల నడుమ గుట్టుగా సాగుతున్న ప్రేమాయణంలా కనిపిస్తోంది. ట్యాలెంటెడ్ సాయి పల్లవితో భళ్లాలుడు రానా లవ్ వ్యవహారం `విరాఠపర్వం` పోస్టర్ లో స్పష్ఠంగా కనిపిస్తోంది. అడవిలో అన్నతో సాయి పల్లవి ప్రేమాయణం ఏమిటో! అనే సందేహం కలుగుతోందా? దేనికైనా ఓ పర్పస్ ఉంటుంది. పైగా అన్నలు నక్సల్స్ కి 80-90లలో ఉన్న ఇమేజ్ అంతా ఇంతా కాదు.

ఊళ్లో విప్లవభావాలున్న యువతరం అన్నల్లో చేరేవారు. వాళ్లకు అదే ఊరిలో గాళ్స్ లోనూ ఫ్యాన్స్ ఉండేవారు. ఇప్పుడు అలాంటి ఓ ప్రేమకథనే తెరపై చూపిస్తున్నారా? దర్శకుడు వేణు ఉడుగులనే దీనికి సమాధానం చెప్పాలి. రానా- సాయిపల్లవి జంట ఎంతో నేచురల్ గా లవ్ లీగా కనిపిస్తున్నారు.

సురేష్ ప్రొడక్షన్స్ -SLV సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇందులో జాతీయ ఉత్తమ నటి ప్రియమణి ఓ కీలక పాత్రను పోషిస్తున్నారు. ఈ సినిమాలో నక్సలిజం కాన్సెప్ట్.. 90ల నాటి బ్యాక్ డ్రాప్ ఆద్యంతం ఉత్కంఠ గా సాగనున్నాయి. రానా బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేసిన ఫస్ట్ గ్లింప్స్ వైరల్ గా ఆకట్టుకుంది. ఈ మూవీ రిలీజ్ తేదీకి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే ఉంటుందని అభిమానులు వేచి చూస్తున్నారు.× RELATED 'ఆర్.ఆర్.ఆర్' రిలీజ్ డేట్ పై 'వకీల్ సాబ్' ప్రొడ్యూసర్ అప్సెట్..!
×