'లింగొచ్చా' నుంచి పక్కా హైదరాబాదీ లవ్ సాంగ్ 'నూర్జా'..!

'కేరాఫ్ కంచెర‌పాలెం' ఫేమ్ కార్తిక్ రత్నం హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ''లింగొచ్చా''. 'గేమ్ ఆఫ్ లవ్' అనేది దీనికి ఉపశీర్షిక. సుప్యార్ధ్ సింగ్ హీరోయిన్ గా నటించింది. ఆనంద్ బ‌డా ద‌ర్శ‌క‌త్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని బ్లాక్ బాక్స్ స్టూడియోస్ స‌మ‌ర్ప‌ణలో శ్రీక‌ళ ఎంట‌ర్‌టైన్మెంట్స్ బ్యాన‌ర్ లో యాద‌గిరి రాజు నిర్మిస్తున్నారు. హైద‌రాబాద్ లో ఎంతో ఫేమ‌స్ అయిన లింగోచ్చా గేమ్ నేప‌థ్యంలో కొన్ని యదార్ధ సంఘటనలు ఇచ్చిన స్పూర్తితో ఈ ప్రేమ‌క‌థ‌ని తెర‌కెక్కించారు. 'లింగోచ్చా' అనే డిఫెరెంట్ టైటిల్ తో ఇప్పటికే అందరి దృష్టిని ఆకర్షించిన ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్ కూడా విశేష స్పందన తెచ్చుకుంది. ఈ క్రమంలో తాజాగా సంక్రాంతి కానుకగా 'లింగోచ్చా' నుంచి 'నూర్జా' సాంగ్ లిరికల్ వీడియోని రిలీజ్ చేశారు.

'బాదల్ బరిసెనే మబ్బుల్ మెరిసెనే.. పువ్వుల్ కురిసేనే కాదల్ నువ్వేనే..' అంటూ సాగిన ఈ బికాజ్ రాజ్ స్వరాలు సమకూర్చడంతో పాటు తనదైన శైలిలో ఆలపించాడు. ఈ పక్కా హైదరాబాదీ సాంగ్ కి ఉదయ్ మధినేని ఆకట్టుకునే సాహిత్యం అదించారు. ఈ లవ్ సాంగ్ మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటోంది. కార్తీక్ రత్నం 'ధగడ్ శివ' పాత్రలో కనిపిస్తున్న ఈ చిత్రంలో బెబీ ఫిదా మొగ‌ల్ - మాస్ట‌ర్ ప్రేమ్ సుమ‌న్ - ఉత్తేజ్ - తాగుబోతు ర‌మేశ్ - కునాల్ కౌశిక్‌ - బ‌ల్వీర్ సింగ్ - స‌ద్దామ్ హుస్సేన్ - మిమిక్రి మూర్తి - ధీర్ చ‌ర‌ణ్ శ్రీవాస్త‌వ్‌ - ఫిష్ వెంక‌ట్‌ త‌దిత‌రులు నటించారు. 'లింగోచ్చా' సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.


× RELATED పవర్ స్టార్ కెరీర్ లో కాస్ట్లీ సినిమా అదే..!
×