టాలీవుడ్ మంచు ఫ్యామిలీ భోగి స్పెషల్ వైరల్ పిక్..

తెలుగు ఇండస్ట్రీలో డైలాగ్ కింగ్ మంచు మోహన్ బాబు ఫ్యామిలీకి ఉన్న ప్రత్యేకత వేరు. సంక్రాంతి పండుగ వచ్చేసింది కదా.. మంచు వారింట్లో సంక్రాంతి సందడి మొదలైంది. మూడు రోజుల పండుగ కాబట్టి మంచు ఫ్యామిలీ భోగి మంటలు వెలిగించి ఎంజాయ్ చేసినట్లు తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటో చూస్తే అర్ధమవుతుంది. అంతేగాక సోషల్ మీడియా వేదికగా వారి అభిమానులకు శుభాకాంక్షలు తెలిపారు. ఇక మంచు ఫ్యామిలీలో మంచు విష్ణు మనోజ్ ఇద్దరూ ప్రస్తుతం హీరోలుగా కొనసాగుతున్నారు. ఇక లక్ష్మీప్రసన్న గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆమె ఎప్పుడు ఏదొక ప్రోగ్రాంతో సోషల్ మీడియాలో టీవీలో కనిపిస్తూనే ఉంటుంది. ఇక విష్ణు ప్రస్తుతం మోసగాళ్లు అనే బిగ్ ప్రాజెక్ట్ తో మల్టీలాంగ్వేజ్ వైడ్ విడుదలకు రెడీ అవుతున్నాడు.

మంచు ఫ్యామిలీలో బాగా డిఫరెంట్ అనిపించే హీరో మనోజ్. డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్ తో డిఫరెంట్ సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. దాదాపు మూడేళ్ల గ్యాప్ తర్వాత ఒక పవర్ఫుల్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడట. మనోజ్ హీరోగా 'అహం బ్రహ్మాస్మి' అనే సినిమా తెరకెక్కుతోంది. తానే సొంతంగా ఎంఎం ఆర్ట్స్ నిర్మాణ సంస్థను ప్రారంభించి 'అహం బ్రహ్మాస్మి'ని ఫస్ట్ సినిమాగా ప్రొడ్యూస్ చేస్తున్నాడు. ఇదివరకే ఈ సినిమా ఫస్ట్లుక్ను విడుదల చేసి అభిమానులకు ట్రీట్ ఇచ్చాడు. గత కొంతకాలంగా మనోజ్ ఖాతాలో హిట్స్ లేవని చెప్పాలి. ఎందుకంటే పోటుగాడు కరెంటుతీగ సినిమాల తర్వాత మళ్లీ హిట్ పడలేదు. 'భారీ విరామం తర్వాత బిగ్ స్క్రీన్ మీద గోల చేయడానికి వస్తున్నాను. ఈ క్రైమ్ కామెడీ యాక్షన్ ఫిల్మ్తో మీకు కొన్ని గూస్బంప్స్ ఇస్తా'నని అన్నాడు. ఇక తాజాగా ఇంస్టాలో ఫ్యామిలీతో భోగి జరుపుకుంటున్న పిక్ షేర్ చేసాడు. అందులో ఎర్లీ మార్నింగ్ ఫ్యామిలీ అంతా భోగి మంటలు వెలిగించి ఎంజాయ్ చేస్తున్న మూమెంట్ చూడవచ్చు. ప్రస్తుతం ఈ పిక్ నెట్టింట వైరల్ గా మారింది.
× RELATED 'సన్ ఆఫ్ ఇండియా' ఫస్ట్ లుక్ డేట్ ఖరారు!
×