ఆటగాళ్లకు కొవిడ్ తిప్పలు.. ఆ స్టార్ క్రీడాకారుడికి రక్తం కారింది

కోవిడ్ వేళ.. క్రీడాకారులు తీవ్రమైన ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నారు. టోర్నమెంట్లో పాల్గొనేందుకు వారు తరచూ ప్రయాణాలు చేయాల్సి రావటం.. ఈ సందర్భంగా వారికి తరచూ కోవిడ్ టెస్టులు చేయించుకోవాల్సి వస్తోంది. దీంతో.. వారు తీవ్ర ఇబ్బందికి అంతకు మించిన అసౌకర్యానికి గురవుతున్నారు. తాజాగా ఇలాంటి ఇబ్బందినే ఎదుర్కొన్నారు భారత స్టార్ షట్లర్ కిడాంబి శ్రీకాంత్.

తాజాగా టెస్టు చేయించుకున్న అతడు.. తనకు ఎదురైన చేదు అనుభవాన్ని వెల్లడించాడు. కోవిడ్ టెస్టుతో వచ్చిన సమస్య ఏమంటే.. ముక్కులో నుంచి శాంపిల్ తీసుకునే క్రమంలో.. స్టిక్ ను సున్నితంగా కదల్చాల్సి ఉంటుంది. అందుకు భిన్నంగా.. కాస్త తేడాగా కదిపినా.. సున్నితంగా ఉండే ముక్కులోపలి  భాగం డ్యామేజ్ అయి.. రక్తం కారుతోంది.

కోవిడ్ శాంపిల్ సేకరించే వారి వ్యక్తిగత పని తీరు ఆధారంగా ఒక్కొక్కరికి ఒక్కోలాంటి అనుభవం చోటు చేసుకుంటుంది. తాజాగా అతడు ఒక టోర్నీలో పాల్గొనేందుకు కోవిడ్ టెస్టు చేయించుకున్నాడు. ఈ సందర్భంగా తన పట్ల వైద్యులు దురుసుగా వ్యవహరించారని.. దీంతో.. తన ముక్కు నుంచి రక్తం కారిన వైనాన్ని అతడు పేర్కొన్నాడు.

కోవిడ్ టెస్టు వేళ తనకు ఎదురైన చేదు అనుభవాన్ని సోషల్ మీడియాలో పేర్కొంటూ.. ముక్కు నుంచి రక్తం కారుతున్న ఫోటోను షేర్ చేశారు. ఇది కాస్తా వైరల్ గా మారింది. క్రీడాకారులకు కరోనా పరీక్షలు నిర్వహించే తీరు ఇదేనా? అంటూ అతడు క్వశ్చన్ చేస్తున్నాడు. టోర్నీకి వచ్చే ముందు నాలుగు సార్లు పరీక్షలు చేసుకున్నట్లుగా పేర్కొన్నారు. శ్రీకాంత్ తన అనుభవాన్ని షేర్ చేసుకోవటంతో.. కోవిడ్ పరీక్షల సందర్భంలో తమకు ఎదురైన ఇబ్బందుల్ని పలువురు గుర్తు చేసుకుంటున్నారు.
× RELATED నిమ్మగడ్డ నుంచి ఆ ఇద్దరినీ జగన్ కాపాడుతాడా?
×