గ్రేటర్ పోలింగ్: చైతన్యపురిలో టీఆర్ఎస్-బీజేపీ ఫైట్

గ్రేటర్ పోలింగ్ ప్రారంభమైంది. 150 డివిజన్లలో ఓటింగ్ కొనసాగుతోంది.  ఈ క్రమంలోనే నిన్న రాత్రి నుంచే ఓటర్లకు ప్రలోభాలు మొదలయ్యాయి. మందు విందు డబ్బులు పంపిణీ జోరుగా సాగినట్టు సమాచారం.

తాజాగా చైతన్యపురి డివిజన్ లో ఓ నేత ఇంట్లో లభించిన మద్యం బాటిళ్లు వివాదానికి కారణమయ్యాయి. టీఆర్ఎస్ బీజేపీ కార్యకర్తల మధ్య తోపులాటకు దారితీసింది. ఈ దాడుల్లో బీజేపీ కార్యకర్తలు గాయపడ్డారు. అడ్డుకోబోయిన బీజేపీ కార్పొరేటర్ అభ్యర్థి రంగా నర్సింహాగుప్తా స్వల్పంగా గాయపడ్డారు.

పోలీసులు విషయం తెలుసుకొని అక్కడికి చేరుకొని ఇరువర్గాలను చెదరగొట్టారు. బీజేపీ నాయకులను నెట్టివేయడంతో వారికి గాయాలయ్యాయి. బీజేపీ కార్యాలయంపై దాడి చేసేందుకు వచ్చిన టీఆర్ఎస్ నేతలను వదిలేసి తమపై లాఠీచార్జి చేసి గాయపరిచారని ఆరోపిస్తూ బీజేపీ నేతలు రోడ్డుపై బైటాయించి ఆందోళన చేశారు.

దాడులకు నిరసనగా బీజేపీ శ్రేణులు రెండు గంటల పాటు ధర్నా చేపట్టడంతో ఉద్రిక్తత ఏర్పడింది. వారికి మద్దతుగా ఎమ్మెల్యే రాజాసింగ్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు రంగారెడ్డి ఆందోళనలో పాల్గొన్నారు. లాఠీచార్జిని చేసిన ఎస్సైని సస్పెండ్ చేయాలని ఏసీపీకి ఫిర్యాదు చేశారు.
× RELATED జైల్లో ఒంటరిగా పద్మజ.. అదే మానసిక స్థితి.. ఈ ఘటన నేర్పుతున్న పాఠాలెన్నో..!
×