914 ఓట్లలో 657 ఓట్లు గల్లంతు ...నిరసన వ్యక్తం చేస్తున్న ఓటర్లు ఎక్కడంటే ?

గ్రేటర్ పోలింగ్ ఉదయం 7 గంటల నుండే  జరుగుతోంది. అయితే చాలా చోట్ల పోలింగ్ మందకోడిగా సాగుతోంది. గ్రేటర్ వాసులు ఇంకా నిద్ర వీడలేదు. ఇకపోతే జియాగూడలోని 38వ పోలింగ్ బూత్‎ లో సుమారు ఆరు వందల ఓట్లు గల్లంతయ్యాయి. ఈ బూత్ లో  914 ఓట్లకు గాను 657 ఓట్లు గల్లంతు అయ్యాయి. ఓటర్ లిస్ట్‎ లో డిలీటెడ్ అని చూపిస్తుండడంతో ఓటర్లు ఆందోళనకు దిగారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఓటు వేశామని ఇప్పుడు ఎలా తొలగిస్తారని ఓటర్లు ప్రశ్నిస్తున్నారు. ఓటర్ ఐడీ ఓటర్ స్లిప్పులు ఉన్నప్పటికీ ఓటరు జాబితాలో పేర్లు తొలగించడం పట్ల నిరసన వ్యక్తం చేశారు.
 
బూత్ లో మొత్తం 914 ఓట్లు ఉన్నాయి. దానికి సంబంధించి అందరికీ ఓటర్ స్లిప్ కూడా పంచేసారు. అవీ పట్టుకొని రెండు కాలనీలకు చెందినవారు వచ్చారు. అయితే 657 మంది ఓట్లు లేవు. దీంతో వారు షాక్ అవుతున్నారు.  చాలా కుటుంబాలలో భార్యకు ఓటు ఉంటే భర్త పేరు తొలగించడం భర్త పేరు ఉంటే భార్య పేరు తొలగించడం వంటివి చోటు చేసుకున్నట్టు తెలుస్తుంది. నిపోయిన వారి పేర్లు ఓటర్ లిస్టు లో ఉండగా.. ఉన్నవారిని చనిపోయారంటూ చూపిస్తూ ఓట్లు తొలగించారని స్థానికులు ఆందోళన చేస్తున్నారు. 30 ఏళ్ల నుండి ఓటు వేస్తున్నాను ఇప్పుడు నా పేరు తొలగించారు అని చాలామంది ప్రశ్నిస్తున్నారు.

తుది జాబితాలో మాత్రం పేర్లు లేదు. దీంతో ఓటు వేసేందుకు అధికారులు అనుమతించలేదు. అంటే కేవలం 257 మందిని మాత్రమే అనుమతించబోతున్నారు. ఈ స్థాయిలో ఓట్లు గల్లంతవడం ఆందోళన కలిగిస్తోంది. ఆడపా దడపా పది పరక ఓట్లయితే.. గల్లంతవుతాయి.. కానీ ఓకే పోలింగ్ స్టేషన్ వద్ద వందల ఓట్లు గల్లంతవడం ఇదే తొలిసారి. దీంతోపాటు మూసాపేట్ జనతానగర్ కూకట్ పల్లిలో కూడా 30 వరకు ఓట్లు గల్లంతయ్యాయి. ఇటు కూకట్ పల్లి బాలాజీ నగర్ పోలింగ్ స్టేషన్ వద్ద విచిత్ర పరిస్థితి నెలకొంది.
× RELATED ఏపీ ప్రభుత్వ ప్రకటనలో.. తెలంగాణ రాష్ట్ర లోగో.. పిక్ వైరల్..!
×