చిరు లేకుండానే మెగా రీమేక్ స్టార్ట్ చేసేశారా..?

మెగాస్టార్ చిరంజీవి - దర్శకుడు మెహర్ రమేష్ కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో అనిల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ - శృతి హాసన్ జంటగా నటించిన తమిళ్ 'వేదలమ్' సినిమాకి ఇది రీమేక్ గా రానుంది. ప్రస్తుతం చిరంజీవి నటిస్తున్న 'ఆచార్య' షూటింగ్ పూర్తైన వెంటనే ఈ ప్రాజెక్ట్స్ సెట్స్ పైకి వెళ్తుందని అందరూ భావించారు. అయితే ఇంకా అధికారికంగా ప్రకటించని ఈ సినిమా గురించి ఫిలిం సర్కిల్స్ లో ఓ న్యూస్ వినిపిస్తోంది.

మెహర్ రమేష్ ఈ సినిమా షూటింగ్ ఆల్రెడీ స్టార్ట్ చేసాడట. కథానుసారం కలకత్తా బ్యాక్ డ్రాప్ లో మెగాస్టార్ లేని కొన్ని సన్నివేశాలను ఇప్పటికే చిత్రీకరించారని టాక్ వినిపిస్తోంది. ఇందులో నిజమెంతనేది తెలియాల్సి ఉంది. మెహర్ ఈ స్క్రిప్ట్ మీద దాదాపు మూడేళ్ళ పాటు వర్క్ చేసి తెలుగు నేటివిటీకి తగ్గట్లు తగినన్ని మార్పులు చేర్పులు చేసినట్టు తెలుస్తోంది. చిరంజీవి ఇమేజ్ ని దృష్టిలో పెట్టుకొని సిస్టర్ సెంటిమెంట్ తో పాటు అన్ని అంశాలు ఉండేలా చూసుకుంటున్నాడని సమాచారం.

కాగా చిరు ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న 'ఆచార్య' షూటింగ్ లో పాల్గొంటున్నారు. కాజల్ కిచ్లు హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో రామ్ చరణ్ కీలక పాత్రలో కనిపించనున్నాడు. మెగాస్టార్ లైనప్ లో 'లూసిఫర్' తెలుగు రీమేక్ కూడా ఉంది. హోమ్ బ్యానర్ లో తెరకెక్కనున్న ఈ చిత్రానికి ఎవరు దర్శకత్వం వహిస్తారన్న దానిపై ఇంకా క్లారిటీ రావడం లేదు. అలానే బాబీ దర్శకత్వంలో చిరు ఓ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.
× RELATED ఆచార్యకు 'జిగేల్ రాణి' భారీ డిమాండ్స్.. ఏంటంటే??
×