గుర్రపు స్వారీ చేస్తున్న అక్కినేని యువ హీరో..!

అక్కినేని నట వారసుడు గుర్రపు స్వారీ చేయడంలో ఆరితేరిన వాడనే విషయం తెలిసిందే. చిన్నతనంలోనే హార్స్ రైడింగ్ నేర్చుకున్న అఖిల్.. తన మొదటి సినిమా 'అఖిల్' లో ఓ సాంగ్ కోసం గుర్రంపై సవారీ చేస్తూ కనిపించాడు. స్వయంగా గిజెల్ అనే గుర్రాన్ని కలిగియున్న అఖిల్ వీలు దొరికినప్పుడల్లా రైడింగ్ చేస్తూ ఎంజాయ్ చేస్తుంటాడు. ఇటీవల అఖిల్ షేర్ చేసిన గుర్రపుస్వారీ కి సంబంధించిన ఫోటో వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా గుర్రంపై స్వారీ చేస్తున్న ఓ వీడియోను ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు. దీనికి 'మార్నింగ్ రష్.. రోజును ప్రారంభించడానికి ఇంతకంటే మంచి మార్గం ఏముంటుంది' అంటూ క్యాప్షన్ పెట్టాడు. హార్స్ రైడింగ్ చేస్తున్న అఖిల్ వీడియోను చూసిన అభిమానులు ఖుషీ అవుతున్నారు. అలానే ప్రస్తుతం తాను నటిస్తున్న సినిమాల్లో గుర్రపు స్వారీకి సంబంధించిన సన్నివేశాలు ఉండబోతున్నాయేమో అనే ఆలోచన కూడా చేస్తున్నారు. మరి ఈ విన్యాసాల ప్రదర్శన సినిమా కోసమా లేదా తన హాబీ లో భాగంగా చేస్తున్నాడా అనేది అఖిలే చెప్పాలి.

కాగా 'సిసింద్రీ' గా అలరించిన అఖిల్.. అక్కినేని మూడు తరాలు కలిసి నటించిన 'మనం' సినిమాలో తళుక్కుమన్నాడు. 'అఖిల్' సినిమాతో సోలో హీరోగా వచ్చిన అఖిల్ ప్రస్తుతం సరైన సక్సెస్ కోసం ఎదురు చూస్తున్నాడు. ఎలాగైనా బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవాలని తన శక్తినంతా ధార పోస్తున్నాడు. 'హలో' 'మిస్టర్ మజ్ను' సినిమాలు పాజిటివ్ టాక్ తెచ్చుకున్నా బాక్సాఫీస్ వద్ద వసూళ్లను రాబట్టలేకపోయాయి. ఈ క్రమంలో అఖిల్ నాలుగో సినిమాగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' సినిమా రాబోతోంది. అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై బన్నీ వాస్ - వాసు వర్మ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. షూటింగ్ చివరి దశకు చేరుకున్న ఈ చిత్రంలో పూజాహెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. దీని తర్వాత అఖిల్ స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఓ చేయనున్నాడు. ఈ ప్రాజెక్ట్ ని ఏకే ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై అనిల్ సుంకర నిర్మించనున్నారు. ఈ రెండు సినిమాలతో అఖిల్ ట్రాక్ లోకి వస్తాడని ఫ్యాన్స్ నమ్మకంగా ఉన్నారు.
× RELATED ఫోటో స్టోరి: సమ్మర్ రాక ముందే మంటలు పెడుతోంది
×