హారిక ఇచ్చిన షాక్ కు అభిజిత్ కంట కన్నీరు

బిగ్ బాస్ లో ఈ వారం నామినేషన్ ప్రేక్షకులు ఊహించని విధంగా జరిగాయి. ఈసారి ఇద్దరికి మించి నామినేట్ చేసే అవకాశంను బిగ్ బాస్ ఇచ్చాడు. కాని మోనాల్ మరియు అరియానాలు మాత్రమే ముగ్గురుని చేశారు. మిగిలిన వారు అంతా ఇద్దరు చొప్పున చేశారు. అభిజిత్ ను హారిక నామినేట్ చేస్తున్నట్లుగా చెప్పడంతో అంతా షాక్ అయ్యారు. అదే సమయంలో అభిజిత్ కూడా కన్నీరు పెట్టుకున్నాడు. టాస్క్ చేసేందుకు ఒప్పుకోక పోవడమే దీనికి కారణం అంటూ హారిక చెప్పింది. ఆ టాస్క్ ఎందుకు చేయలేదు అనే విషయం నీకు తెలుసు. నీవే నన్ను నామినేట్ చేయడం ఏంటీ అన్నట్లుగా అభిజిత్ ఎమోషనల్ అయ్యాడు. ఆ సమయంలో హారిక కూడా ఏడుపు దిగమింగుకుంది.

అభిజిత్ మరియు అవినాష్ ను హారిక నామినేట్ చేసింది. అవినాష్ ను ఆమె నామినేషన్ చేయడం పెద్దగా షాకింగ్ గా అనిపించలేదు. ఆ తర్వాత అభిజిత్ మళ్లీ హారికను నామినేట్ చేశాడు. మోనాల్ వల్ల తనకు ఎందుకో మొదటి నుండి ఏదో ఒక ప్రాబ్లం వస్తూనే ఉంది. కాని వల్ల చాలా ఇబ్బంది పడ్డట్లుగా అనిపించింది. అందుకే మోనాల్ ను నేను నామినేట్ చేస్తున్నాను అంటూ అభిజిత్ తన వద్ద ఉన్న కలర్ వాటర్ దాదాపు పూర్తిగా పోశాడు. కేవలం 50 ఎంఎల్ మాత్రమే ఉంచి దాన్ని హారిక కంటైనర్ లో పోశాడు. అఖిల్ తో గొడవ ఇక్కడితో వదిలేద్దాం అనుకుని ఈ పని చేస్తున్నట్లుగా అన్నాడు.

తాజా నామినేషన్ ఎపిసోడ్ లో అభిజిత్ చాలా ఎమోషనల్ అయ్యాడు. ఇక మరో ఆసక్తికర విషయం ఏంటీ అంటే మోనాల్ టైం వచ్చినప్పుడు ఆమె చాలా సీరియస్ అయ్యింది. మొదట అవినాష్ ను నామినేట్ చేసిన ఆమె నీ కంటే నేను స్ట్రాంగ్ మళ్లీ నన్ను వీక్ అనొద్దు. ఆ విషయాన్ని ప్రేక్షకులు కూడా నిరూపించారు అంటూ మోనాల్ చెప్పింది. ఇక అభిజిత్ మరియు అఖిల్ లను కూడా నామినేట్ చేసింది. అభిజిత్ పెద్దగా స్పందించలేదు కాని అఖిల్ మాత్రం చాలా సీరియస్ గా రియాక్ట్ అయ్యాడు. ఇద్దరి మద్య మాటల యుద్దం సాగింది.

ఆ కోపంలో ఉండగా అరియానా వచ్చి నామినేట్ చేయడం ఆ సమయంలో అవినాష్ తెలుగులో మాట్లాడాలంటూ చెప్పడం తో మోనాల్ కు తిక్క రేగినంత పనైంది. ఆమె సహనం కోల్పోయి అరిచేసింది. మొత్తానికి సోహెల్ మరియు అరియానా మినహా మిగిలిన అయిదుగుర అఖిల్.. అభిజిత్.. అవినాష్.. హారిక మరియు మోనాల్ లు ఈ వారం నామినేషన్ లో ఉన్నారు. మరి వీరిలో ఈ వారం పోయేది ఎవరో చూడాలి.
× RELATED పవర్ స్టార్ కెరీర్ లో కాస్ట్లీ సినిమా అదే..!
×